Ys jagan : నీ రాక కోసం .. వారంతా ఎదురు చూపులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడాదిన్నర గా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లలేకపోయారు. కోవిడ్ నిబంధనలను [more]

;

Update: 2021-09-23 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడాదిన్నర గా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లలేకపోయారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సి రావడం, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన క్యాంపు కార్యాలయం నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాల్లో పాలనతో పాటు పార్టీ పరిస్థితి కూడా కొంత గాడి తప్పింది.

కరోనా తీవ్రత తగ్గడంతో….

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. దీంతో జగన్ జనం మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబరు నుంచి జిల్లాల పర్యటనలు ఉంటాయని జగన్ సంకేతాలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాలనుకున్న రచ్చ బండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ప్రతి వారం ఒక జిల్లాలో పర్యటించాలని జగన్ భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలకు కూడా పల్లెలకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ను రూపొందించాలని ఇప్పటికే జగన్ ఆదేశించారని తెలుస్తోంది.

పార్టీలో విభేదాలు….

మరోవైపు జిల్లాల్లో పార్టీ పరిస్థితులు కూడా ఏమాత్రం బాగా లేవు. నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల పర్యటన పార్టీలో నెలకొన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ సమయం కూర్చుని మాట్లాడితే పరిష్కారం కాకుండా పోయే సమస్యలేవీ కాదు. అందుకే జగన్ రాక కోసం అనేక మంది వైసీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు.

ప్రజాసమస్యలతో పాటు….

దీంతో పాటు జిల్లాల్లో రహదారుల సమస్యలతో పాటు నియోజకవర్గాల్లో సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. జగన్ పర్యటనతో వాటి పరిష్కారం కూడా అవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్థానిక పదవులను కూడా జగన్ భర్తీ చేయడంతో జగన్ పర్యటన కోసం వారంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ప్రజా సమస్యలను పరిష్కారం చూపడంతో పాటు పార్టీ విభేదాలకు కూడా జగన్ పర్యటన ఫుల్ స్టాప్ పెడుతుందన్న ఆశాభావంతో వైసీపీ నేతలు ఉన్నారు.

Tags:    

Similar News