Ys jagan : జగన్ పులివెందులకు బై బై చెప్పనున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా? జగన్ ఆలోచన అదే విధంగా ఉందా? ఈసారి జగన్ రెండుచోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ? అంటే [more]

Update: 2021-10-13 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా? జగన్ ఆలోచన అదే విధంగా ఉందా? ఈసారి జగన్ రెండుచోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. జగన్ రాజకీయంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు ముఖ్యం. రెండోసారి గెలిచి విపక్ష టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.

ఇప్పటి వరకూ పులివెందుల నుంచే…

వైఎస్ జగన్ ఇప్పటి వరకూ ఎప్పుడూ రెండు చోట్ల నుంచి పోటీ చేయలేదు. ఆయన ఎప్పుడైనా పులివెందుల నుంచి పోటీ చేస్తారు. అక్కడ పెద్దగా ప్రచారానికి కూడా వెళ్లరు. ఎందుకంటే పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. అక్కడ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా జగన్ దరిదాపుల్లో ఉండరు. పులివెందులలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. విపక్షాలు సయితం జగన్ పులివెందులకు దోచి పెడుతున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర నుంచి….

అయితే ఈసారి జగన్ ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకు కారణాలు కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ మూడు రాజధానులను ప్రకటించినా న్యాయస్థానాలకు వెళ్లి విపక్షాలు దానిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అమరావతి రైతులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ కేసు ఎప్పటికి తేలుతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉత్తరాంధ్రలో పోటీ చేయాలని భావిస్తున్నారంటున్నారు.

పాగా మరోసారి వేసేందుకు….

పులివెందులతో పాటు ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం నుంచి జగన్ పోటీ చేయాలను కుంటున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర లో వైసీపీ మరింత బలోపేతం అవుతుంది. రాయలసీమలో ఎటూ వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను మినహాయిస్తే గుంటూరు, కృష్ణాలోనే పార్టీ కొంత దెబ్బతినే అవకాశముందన్న లెక్కలు వేస్తున్నారట. ఇటీవల ఉత్తరాంధ్ర కు చెందిన ముఖ్యనేతతో జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద జగన్ ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండుచోట్ల నుంచి జగన్ పోట ీచేస్తారంటున్నారు.

Tags:    

Similar News