Ys jagan : వారు.. వీరు లేదు.. టోటల్ ఛేంజ్

సో.. క్లారిటీ వచ్చింది. మంత్రి వర్గ విస్తరణ గ్యారంటీ. అందులో కీలక నేతలను కూడా జగన్ తప్పించేందుకు సిద్ధమయ్యారు. సీనియర్లు, జూనియర్లు అనేది లేదు. అందరినీ ఒకేసారి [more]

;

Update: 2021-09-25 13:30 GMT

సో.. క్లారిటీ వచ్చింది. మంత్రి వర్గ విస్తరణ గ్యారంటీ. అందులో కీలక నేతలను కూడా జగన్ తప్పించేందుకు సిద్ధమయ్యారు. సీనియర్లు, జూనియర్లు అనేది లేదు. అందరినీ ఒకేసారి తప్పించి ఫ్రెష్ గా కొత్త మంత్రివర్గాన్ని జగన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది గాలి వార్త కాదు. ఎవరో చెప్పింది అసలే కాదు. జగన్ కు దగ్గరి బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది. నమ్మి తీరాల్సిందే. దీన్ని బట్టి టీటల్ మంత్రివర్గాన్ని జగన్ మార్చి వేస్తారన్నది వాస్తవం.

కొందరినే ….

ఇప్పటివరకూ జగన్ కొందరు మంత్రులను కొనసాగిస్తారని భావించాం. సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారితో పాటు పార్టీకి, తనకు లాయల్ గా ఉన్న వారిని కొనసాగించాలని జగన్ భావించారన్న వార్తలు వచ్చాయి. ఇలా లాయల్ గా ఉన్న వారిలో మేకపాటి గౌతం రెడ్డి వంటి మంత్రులు ఉన్నారు. ఇక సామాజిక పరంగా కూడా కొందరని తప్పించరన్న ప్రచారం జరిగింది.

మంత్రుల మార్పుతో….

కానీ ఇవేమీ నిజం కాదని బాలినేని బాంబు పేల్చారు. త్వరలో జగన్ వంద శాతం కేబినెట్ ను మారుస్తారని చెప్పారు. అదే నిజమైతే ఇప్పుడున్న ఏ ఒక్క మంత్రి కేబినెట్ లో కొనసాగే వీలుండదు. జగన్ పార్టీ గెలిచిన తొలి రోజుల్లోనే 90 శాతం కేబినెట్ లో రెండున్నరేళ్ల తర్వాత మార్పులుంటా యని చెప్పారు. అయితే వంద శాతం మార్చేయాలని నిర్ణయించారు. నిజానికి మంత్రుల వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరింది లేదు. మొత్తం సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలలోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు.

వారికి పార్టీ బాధ్యతలు….

దీంతో పాటు వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగనుంది. ఈ టీంకు సహకారంతో పాటు పార్టీ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను పూర్తిగా పార్టీ సేవలకు ఉపయోగించుకుంటే సత్ఫలితాలు వస్తాయని జగన్ ఆశిస్తున్నారు. అందుకే జగన్ వారు… వీరు అని లేకుండా మొత్తం మంత్రి వర్గాన్ని మార్చే యాలని జగన్ నిర్ణయించుకోని ఉండొచ్చు.

Tags:    

Similar News