Ys jagan : వారితో మింగిల్ కాలేకనేనా?

ఏదైనా స్ట్రయిట్ రాజకీయాలు కోరుకుంటారు జగన్. దొడ్డి దారి రాజకీయాలు అసలు గిట్టవు. బ్లాక్ మెయిలింగ్ అంటే అసలు నచ్చదు. మంత్రి వర్గ విస్తరణలో సీనియర్ నేతలను [more]

;

Update: 2021-10-10 08:00 GMT

ఏదైనా స్ట్రయిట్ రాజకీయాలు కోరుకుంటారు జగన్. దొడ్డి దారి రాజకీయాలు అసలు గిట్టవు. బ్లాక్ మెయిలింగ్ అంటే అసలు నచ్చదు. మంత్రి వర్గ విస్తరణలో సీనియర్ నేతలను పక్కన పెడతారన్నది ప్రచారమా? లేదా నిజమా? అన్నది పక్కన పెడితే జగన్ తాను కోరుకుంటున్నది అదే అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ యువ మంత్రులతో ఉన్నంత ఫ్రీగా సీనియర్ నేతలతో మాట్లాడలేరు. చిన్న వారి నుంచి పెద్దోళ్ల వరకూ జగన్ అన్నా అని సంభోదిస్తారు.

మింగిల్ కాలేక…

అయినా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లతో జగన్ మింగిల్ కాలేరు. వారితో మనసు విప్పి కూడా మాట్లాడలేరు. వారికి ఏమైనా చెప్పదలచుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారితో చెప్పిస్తూ వస్తున్నారు. ఇక సీనియర్లు నిర్వహిస్తున్న శాఖల్లో సయితం నేరుగా వారికి చెప్పకుండా సీఎంవో నుంచి సమాచారం ఇస్తూ వస్తున్నారు. ఏజ్ గ్యాప్ తో పాటు అభిప్రాయాలు కూడా విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణం.

తన వయసు వారితో….

జగన్ తన వయసు వారైన మేకపాటి గౌతంరెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని వారితో మనసు విప్పి మాట్లాడతారంటారు. వారితో మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలు కూడా చర్చిస్తారు. నవ్వుతూ, జోకులేస్తూ అనేకసార్లు జగన్ వారితో మాట్లాడిన సందర్భాలున్నాయి. కానీ సీనియర్ల విషయంలో జగన్ మూడ్ వేరేగా ఉంటుంది. ఇవి ఎవరో చెప్పినవి కాదు. జగన్ ను దగ్గరుండి చూసిన నేతలే చెబుతున్నవి.

పార్టీ బలోపేతానికి….

ఈ పరిస్థితుల్లో సీనియర్లను దూరం పెట్టినా ఏమీ కాదు. పార్టీ సేవలకు వారిని ఉపయోగించు కోవచ్చు. ఒక ఏజ్ వచ్చాక ఎక్కడైనా రిటైర్ మెంట్ తప్పదు. అలాగే రాజకీయాల్లో కూడా ఇది అవసరమనిపిస్తుంది. వంద శాతం మంత్రివర్గాన్ని మార్చివేస్తారన్న ప్రచారంపై బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా పాజటివ్ గా స్పందించారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. ఇలా కొత్త కేబినెట్ లో సీనియర్ నేతలకు ఎవరికీ అవకాశం ఉండదంటున్నారు. యువ టీంతోనే జగన్ ఎన్నికలకు వెళతారంటున్నారు.

Tags:    

Similar News