Ys jagan : జాతీయ మీడియా జగన్ ను దూరం పెట్టిందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. అయితే జగన్ కు జాతీయ మీడియాలో అంత చోటు లేకుండా పోయింది. జగన్ అమలు చేస్తున్న పథకాలు, [more]

Update: 2021-10-17 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. అయితే జగన్ కు జాతీయ మీడియాలో అంత చోటు లేకుండా పోయింది. జగన్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొన్నింటిని తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు తమ బృందాలను ఏపీకి పంపుతున్నాయి. అయితే జాతీయ మీడియాలో మాత్రం జగన్ కు ఎక్కడా చోటు దక్కడం లేదు.

కార్యక్రమాలు చేపడుతున్నా…

జగన్ అధికారంలోకి వచ్చిన వివిధ పథకాలతో పాటు 108 వాహనాలను వేల సంఖ్యలో కొనుగోలు చేయడం, ప్రతి పేదవారికి పట్టాతో పాటు సొంత ఇల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం వంటివి జాతీయ మీడియా విస్మరించిందనే చెప్పాలి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఫీడ్ బ్యాక్ ఇచ్చే వారు లేకనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.

చంద్రబాబు అధికారంలో ఉండగా….

చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి నుంచి పోలవరం వరకూ జాతీయ స్థాయి మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చేవి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనను కూడా ఆకాశానికెత్తేవి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాకు కూడా దూరంగా ఉంటుండటమే దీనికి కారణమని పార్టీ నేతలు అంటున్నారు.

ఇది ప్రతికూలమే….

ఇప్పటికీ చంద్రబాబు జాతీయ మీడియా ప్రతినిధులతో రెండు, మూడు నెలలకొకసారి విందు సమావేశాల్లో పాల్గొంటారు. కానీ జగన్ కు ఆ అలవాటు లేదు. రాష్ట్ర మీడియానే జగన్ పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో జగన్ కు జాతీయ మీడియాలో ప్రాధాన్యత తగ్గిదని, కేసీఆర్ కు ఇచ్చిన ప్రయారిటీ కూడా జగన్ కు ఇవ్వడం లేదంటున్నారు. పైగా జాతీయ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుండటం జగన్ కు ఇబ్బంది కరమే.

Tags:    

Similar News