Ys jagan : ఇక వాళ్లందరినీ అక్కడికే… నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. సీనియర్ నేతలకు ఇక అక్కడే స్థానం కల్పించాలని నిర్ణయించారు. శాసనసభకు దూరంగా ఉంచాలన్నది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. [more]

Update: 2021-10-10 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. సీనియర్ నేతలకు ఇక అక్కడే స్థానం కల్పించాలని నిర్ణయించారు. శాసనసభకు దూరంగా ఉంచాలన్నది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. సీనియర్ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా దక్కే అవకాశం లేదు. ముఖ్యమైన నేతలకు ఇక పార్టీలోనే కీలక పదవులు అప్పగించి వారిని ప్రభుత్వ పరంగా దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు.

వ్యూహాలు, సూచనలకే….

పార్టీలో వ్యూహాలు అవసరం. పార్టీని గెలిపించడం కోసం సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అంతే తప్ప వారికి కీలకమైన పదవులు అప్పగించడం సరికాదన్న అభిప్రాయంలో జగన్ ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ తో జనంలోకే ఎవరూ వెళ్లలేకపోయారు. ఇలాంట ిపరిస్థితుల్లో సీనియర్ నేతలు మరింత ఇబ్బంది పడ్డారు. రాజకీయంగా వారి వ్యూహాలు, ఎత్తుగడలు జిల్లాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

వయసు మీద పడుతుండటంతో….

జగన్ ప్రస్తుతం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. డిసెంబరు నుంచి ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. ప్రతి వారంలో రెండు సార్లు గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యేలు ఖచ్చితంగా విజిట్ చేయాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. అయితే కరోనా కారణంగా కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లు అయినా వారికి టిక్కెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.

మండలికి పంపి….

వీరందరికీ శాసనసభకు కాకుండా శాసనమండలికి పంపాలని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారందరూ పెద్దల సభకు అవకాశం ఉంటుందని చెబుతన్నారు. పెద్దలసభ ద్వారా, ఇటు పార్టీలో కీలక పదవుల ద్వారా సీనియర్ల నుంచి సలహాలు, సూచనలను మాత్రమే తీసుకోవాలని జగన్ నిర్ణయంగా ఉంది. వారి వారసులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మాత్రం జగన్ అంగీకరించారంటున్నారు.

Tags:    

Similar News