Ys jagan : పవర్ ఛేంజ్ చేస్తే వారికే లాభమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం కేబినెట్ ను మార్చాలని జగన్ నిర్ణయించారు అయితే కొత్తగా ఏర్పడే మంత్రి [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం కేబినెట్ ను మార్చాలని జగన్ నిర్ణయించారు అయితే కొత్తగా ఏర్పడే మంత్రి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం కేబినెట్ ను మార్చాలని జగన్ నిర్ణయించారు అయితే కొత్తగా ఏర్పడే మంత్రి వర్గం ఎన్నికల టీంగా జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఎంతో మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలతో పాటు సీనియర్లు కూడా ఈసారి తమకు కేబినెట్ లో చోటు దక్కుతుందని గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కినవారు అదృష్ట వంతులుగా పేర్కొంటున్నారు.
ఎన్నికలకు ముందు….
సహజంగా ఎన్నికల సమయంలో ఉన్న మంత్రి పదవిలో ఉన్న వారికి అడ్వాంటేజీ ఉంటుంది. మంత్రిగా తన నియోజకవర్గంలో పట్టు మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తన నియోజకవర్గం మాత్రమే కాకుండా శాఖలను బట్టి జిల్లాను కూడా గ్రిప్ లో ఉంచుకునేందుకు వీలవుతుంది. తమకు సానుకూల వాతావరణం ఎన్నికలలో కల్పించుకోవడానికి కొత్తగా మంత్రులయిన వారికి అవకాశం దక్కుతుంది.
సీనియర్లలో ఆశలు…
వైసీపీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు వంటి సీనియర్లు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిదశలోనే తమకు మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా సామాజిక సమీకరణాల దృష్ట్యా లభించలేదని, ఈసారి ఖచ్చితంగా జగన్ అవకాశమిస్తారని వారు భావిస్తున్నారు. అనేక మంది యువ ఎమ్మెల్యేలు సయితం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
పట్టు పెంచుకోవడానికి….
జగన్ కూడా వంద శాతం కేబినెట్ ను మార్చి పవర్ ఛేంజ్ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవి దక్కితే తాము తిరిగి గెలవడం సునాయాసమవుతుందని కొందరు లెక్కలు వేస్తున్నారు. వందశాతమందిని మారిస్తే అసమ్మతి కూడా పెద్దగా బయటపడే అవకాశముండదు. ఎన్నికల వేళ మంత్రిగా ఉండటం కోసం సహజంగానే పోటీ ఎక్కువవుతుంది. అయితే వీరిలో అదృష్టవంతులు ఎవరన్నది మాత్రం తేలాల్సి ఉంది.