Ysrcp : అక్కడే తేల్చుకుంటారట.. రెడీ అయిపోయారు

రాజకీయాల్లో తన పై ఉన్న వ్యతిరేకత కంటే తన మిత్రుడి పై ఉన్న వ్యతిరేకత కూడా ఒక్కోసారి కొంపముంచుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత కనపడుతుంది. [more]

;

Update: 2021-10-10 15:30 GMT

రాజకీయాల్లో తన పై ఉన్న వ్యతిరేకత కంటే తన మిత్రుడి పై ఉన్న వ్యతిరేకత కూడా ఒక్కోసారి కొంపముంచుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత కనపడుతుంది. చాపకింద నీరులా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుంది. దక్షిణాదిన బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీకి దన్నుగా ఉంటున్న పార్టీలపై కూడా ఆ ప్రభావం ఉంటుందంటున్నారు. అందుకే మరోసారి విజయం సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ బీజేపీని మరింత దూరం చేసుకుంటనే బెటర్ అంటున్నారు.

విసిగిపోయి….

జగన్ కూడా బీజేపీతో విసిగిపోయి ఉన్నారు. కేంద్రంలో బుజ్జగింపులు, రాష్ట్రంలో ఈసడింపులుగా సాగుతున్న బీజేపీ రాజకీయానికి జగన్ ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. బీజేపీతో ఇప్పటి వరకూ తాను రాష్ట్ర అభివృద్ధి కోసమే సయోధ్యతో వ్యవహరించారని, దీనికి కొందరు తన కేసుల గురించి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు.

కలసిందెప్పుడు?

బీజేపీ తో తెగదెంపులు చేసుకున్నందున రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మోదీపై వ్యతిరేకత నుంచి తాను బయటపడతారు. బీజేపీ కూడా రాష్ట్రంలో జనసేనతో కలసి పోటీ చేస్తుంది. టీడీపీతో కలసి పోటీ చేసేందుకు ఇష్పడదు. అందువల్ల ఓట్లు చీలిపోయి అధికార పార్టీగా తాము లబ్ది పొందవచ్చని జగన్ భావిస్తున్నారు. అసలు తాము బీజేపీతో ఏనాడు నేరుగా పొత్తుకు దిగలేదని, కేంద్రంలో కొన్ని అంశాలకు మాత్రమే తాము మద్దతిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

రాజ్యసభలో…

తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో చేరలేదని కూడా జగన్ పార్టీ నేతలు స్పష‌్టం చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంది, విడిపోయింది చంద్రబాబు మాత్రమేనని, తాము ఎప్పుడూ బీజేపీకి దూరంగానే ఉన్నామని వైసీపీ చెబుతోంది. అయితే రానున్న కాలంలో రాజ్యసభలో బిల్లుల విషయంలో వైసీపీ వ్యతిరేకించే అవకాశముందని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ను చూపించి బీజేపీకి జగన్ మరింత దూరమవుతారన్నది సీనియర్ నేతలు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News