jagan cabinet : కొత్త మహిళా మంత్రులు వీరేనా?
జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. దసరాకు లేదా సంక్రాంతికి విస్తరణ ఉండవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న [more]
;
జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. దసరాకు లేదా సంక్రాంతికి విస్తరణ ఉండవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న [more]
జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. దసరాకు లేదా సంక్రాంతికి విస్తరణ ఉండవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారంటున్నారు. వారిలో మహిళలకు ఇద్దరికి స్థానం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జగన్ మంత్రి వర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు.
మంత్రి వర్గ విస్తరణలో….
ఇక తాజాగా జరిగే మంత్రి వర్గ విస్తరణలోనూ ముగ్గురు మహిళలు ఉంటారంటున్నారు. వారిలో ఎవరనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. గుంటూరు నుంచి మేకతోటి సుచరిత, విజయనగరం నుంచి పుప్షశ్రీవాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనిత జగన్ మంత్రి వర్గంలో ఉన్నారు. ఈ సంఖ్యకు తగ్గకుండా జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తారంటున్నారు.
ప్రచారంలో ఉన్న పేర్లు….
ఇందులో ప్రముఖంగా అనేక పేర్లు విన్పిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలనే తిరిగి మంత్రివర్గంలోకి జగన్ తీసుకుంటారంటున్నారు. అందులో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజనీ, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆర్కే రోజా, రెడ్డి శాంతి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. ఎస్సీ నియోజకవర్గం కోటాలోనూ పలువురు పేర్లు విన్పిస్తున్నాయి. ఎస్టీ కోటాలో పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు కూడా బాగా విన్పిస్తుంది.
ఉప ముఖ్యమంత్రులుగా….
వీరిలో ఇద్దరి మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా జగన్ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ముగ్గురికి ఉద్వాసన తప్పక పోవడంతో మహిళ ఎమ్మెల్యేలు మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఆర్కే రోజా తప్ప అందరూ దాదాపు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో జగన్ మంత్రివర్గంలో కొత్తగా మంత్రులగా బాధ్యతలు చేపట్టబోయే మంత్రులు ఎవరన్న చర్చ పార్టీలో సాగుతుంది.