Ys jagan : చట్టంతో చెడుగుడు… సానుకూలమేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాథ్యతలను స్వీకరించి దాదాపు మూడేళ్లు కావస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. దాదాపు 70 కిపైగా కేసుల్లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాథ్యతలను స్వీకరించి దాదాపు మూడేళ్లు కావస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. దాదాపు 70 కిపైగా కేసుల్లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాథ్యతలను స్వీకరించి దాదాపు మూడేళ్లు కావస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. దాదాపు 70 కిపైగా కేసుల్లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే లోపం ఎక్కడుంది? అధికారులు సరైన దిశగా ఉత్వర్వులు జారీ చేయడం లేదా? జీవోలు జారీ చేసే సమయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.
ఎన్నో జీవోలు….
ఒకటా? రెండా? గడచిన రెండేళ్లలో ఎన్నో జీవోలు. ఎన్నో తీర్పులు. దాదాపు అన్నీ ప్రతి కూలమే. ప్రభుత్వ నిర్ణయాల దగ్గర నుంచి విపక్ష నేతలపై కేసుల వరకూ న్యాయస్థానాల్లో వీగిపోతునే ఉన్నాయి. ఇంటి స్థలాల సేకరణ నుంచి చంద్రబాబుపై కేసు వరకూ ఏ ఒక్కటి ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. జగన్ ప్రభుత్వంలో న్యాయనిపుణులు కూడా సక్రమమైన సూచనలు అందించడం లేదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న అభిప్రాయం.
న్యాయ సలహా….
ఇటీవల టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోను కోర్టు కొట్టివేసింది. యాభై మందిని టీటీడీలో నియమిస్తున్నప్పుడు కనీసం న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇతర రాష్ట్రాల వారిని కూడా నియమించి జీవో కొట్టివేయడంతో వారి ముందు జగన ప్రభుత్వం నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. ఈ జీవోను జారీ చేస్తూ ఏ నిబంధన కింద వీరిని నియమించారో పేర్కొన లేదు. ఇక విపక్ష నేతలపై పెట్టిన అనేక కేసులు వీగిపోయాయి. చివరకు విశాఖ లాంటి నగరాల్లో భూమిని ఆక్రమించుకున్నా కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది.
వరసగా దెబ్బలే….
తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను తొలుత రాష‌్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దానిని కొట్టవేయడంతో మరొక సారి పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారు. వయో పరిమితి విషయాన్ని పరిశీలించక పోవడంతో ఆ కేసును కూడా కొట్టివేసింది. ఇదొక్కటే కాదు అనేక కేసుల విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్టు లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ జీవోలు జారీ చేయడం ఆగలేదు. కోర్టులు కొట్టివేయడం కూడా ఆగడం లేదు. అయితే న్యాయస్థానాల తీర్పులతో తమకు ప్రజాన్యాయస్థానంలో సానుకూలత ఉందని వైసీపీ ధీమాగా ఉంది. అందుకే జీవోల విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి.