ys jagan : వాళ్లు అందుకోనంత స్కోర్ చేయాలట

జగన్ అంతే.. ఒక ఆలోచనకు వస్తే అది అమలు జరిగేంత వరకూ నిద్రపోడంటారు. అంతటి మొండి మనిషి. బద్వేలు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా [more]

;

Update: 2021-10-08 02:00 GMT

జగన్ అంతే.. ఒక ఆలోచనకు వస్తే అది అమలు జరిగేంత వరకూ నిద్రపోడంటారు. అంతటి మొండి మనిషి. బద్వేలు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసకున్నారు. ఇక్కడ గెలుపు తమకు సులువేనని తెలుసు. అయినా విపక్షాన్ని దరిదాపుల్లో లేకుండా చేయాలన్న లక్ష్యమే జగన్ లో కన్పిస్తుంది. టీడీపీ, జనసేనలు బద్వేలులో పోటీ చేయకున్నా అక్కడ వారికి వచ్చే ఎన్నికల నాటికి స్పేస్ లేకుండా చేయాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. ఇందుకోసం ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నేతలకు ఆదేశించారు.

ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ….

బద్వేలు ఉప ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరుగుతున్నాయి. దాదాపు ప్రతి రోజు అక్కడి ఇన్ ఛార్జులతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను జగన్ తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా బద్వేలులో తాము ప్రారంభించిన అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుందా? లేదా? అన్నది కూడా జగన్ ఆరా తీస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కకూడదని ఆదేశించారు.

ప్రత్యేకంగా నివేదికలు….

పంచాయతీ లెవెల్ నేతల నుంచి సహకారం ఎలా అందుతుంది? వారిని బయట నుంచి వచ్చిన నేతలు కలుపుకుని వెళుతున్నారా? లేదా? అన్నది కూడా జగన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బద్వేలు నుంచి తెప్పించుకుంటున్నారు. గత ఎన్నికల కంటే మెజారిటీ మరింత పెరగాలన్నది జగన్ ఆదేశం. అందుకే బద్వేలు బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇక తనకు నమ్మకైన నేతలను మండలాల ఇన్ ఛార్జులుగా నియమించారు.

ఇన్ ఛార్జులతో ఎప్పటికప్పుడు…..

బద్వేలు బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారు. ఆయన నేతృత్వంలో అదిమూలపు సురేష్ బాబు , అంజాద్ బాషా, ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి , పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పనిచేయాల్సి ఉంటుంది. బద్వేల్ మున్సిపాలిటీ ఇన్ ఛార్జిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అట్లూరు మండలం ఇన్ ఛార్జిగా కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, కలసపాడు మండలం ఇన్ ఛార్జిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, బి.కోడూరు మండలం ఇన్ ఛార్జిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, శ్రీ అవదూత కాశీనాయిన మండలం ఇన్ ఛార్జిగా జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, పోరుమామిళ్ల మండలం ఇన్ ఛార్జిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, గోపవరం మండలం ఇన్ ఛార్జిగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిని నియమించారు. వీరిందరితో జగన్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సూచనలు చేస్తున్నారు.

Tags:    

Similar News