Ys jagan : అంతా ఏకమైనా… ఆ సీట్లు పదిలమేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ధీమా ఏంటి? కాలిక్యులేషన్లన్నీ పక్కా వర్క్ అవుట్ అవుతాయా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పుడు తనకు బయట [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ధీమా ఏంటి? కాలిక్యులేషన్లన్నీ పక్కా వర్క్ అవుట్ అవుతాయా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పుడు తనకు బయట [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ధీమా ఏంటి? కాలిక్యులేషన్లన్నీ పక్కా వర్క్ అవుట్ అవుతాయా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పుడు తనకు బయట నుంచి మిత్రులుగా ఉన్న వారు కూడా శత్రువులుగా మారే అవకాశముంది. అయితే ఇదే సమయంలో జగన్ స్ట్రాటజీపై ఎలా ఉంటుందన్న దానిపై పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ టీడీపీతో కలసినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న లెక్కలు వేస్తున్నారు. పార్టీ జరిపిన అంతర్గత సర్వేలో కూడా అదే తెలిపింది.
సీమలో పైచేయి….
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ నాలుగు జిల్లాల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. అనంతపురంలో రెండు, చిత్తూరులో ఒకటి మాత్రమే వచ్చాయి. ఇక కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు పాలనపై అసంతృప్తి కొంత వ్యక్తమయినా దాదాపు నలభై స్థానాలను రాయలసీమ నుంచి తెచ్చుకోవచ్చన్నది జగన్ ఆలోచన.
రెండు జిల్లాల్లోనూ….
ఇక నెల్లూరు జిల్లాలో పది స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పది స్థానాలను గెలుచుకుంది. ఈసారి కనీసం ఎనిమిది స్థానాలను కాపాడుకోగలమన్న ధీమాలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలుంటే అందులో గత ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో వైసీీపీ విజయం సాధించింది. ఈసారి అవే స్థానాలను తిరిగి గెలుచుకుంటామని వైసీపీ జరిపిన అంతర్గత సర్వేలో వెల్లడయిందంటున్నారు.
ఉత్తరాంధ్రలో బలం….?
ఇక కోస్తాంధ్రలో కనీసం వైసీపీ గ్రాఫ్ బాగుందని సర్వేలు వెల్లడించాయి. దాదాపు నలభైకి పైగానే స్థానాలను సాధించుకోవచ్చన్న నమ్మకంతో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని 32 నియోజకవర్గాల్లోనూ పట్టు వైసీపీకే ఉందన్న ఆశాభావంతో ఉన్నారు. విశాఖ రాజధాని ప్రకటన తమకు లెక్కకు మించి సీట్లను తెచ్చిపెడుతుందని ధీమాగా ఉన్నారు. పవన్ కల్యాణ‌్ ఎఫెక్ట్ తో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే కొంత ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల పవన్ వైపు చూసే వారుండరు. ఈ లెక్కతోనే జగన్ ధీమాగా ఉన్నారంటున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న సర్వే నివేదికల ప్రకారం వ్యూహాలను మార్చాలన్నది జగన్ నిర్ణయం.