Ys jagan : జగన్ ను “రెడ్డి” గార్లే దెబ్బతీస్తారా?
ఏపీలో ప్రభుత్వం పట్ల రెడ్లు అసంతృప్తిగా ఉన్నారా? అవునని చెప్పలేం. కాదని చెప్పలేం. దీనిని రూమర్ గా మాత్రం కొట్టి పారేయలేం. పవన్ కల్యాణ‌్ అన్నారని కాదు [more]
;
ఏపీలో ప్రభుత్వం పట్ల రెడ్లు అసంతృప్తిగా ఉన్నారా? అవునని చెప్పలేం. కాదని చెప్పలేం. దీనిని రూమర్ గా మాత్రం కొట్టి పారేయలేం. పవన్ కల్యాణ‌్ అన్నారని కాదు [more]
ఏపీలో ప్రభుత్వం పట్ల రెడ్లు అసంతృప్తిగా ఉన్నారా? అవునని చెప్పలేం. కాదని చెప్పలేం. దీనిని రూమర్ గా మాత్రం కొట్టి పారేయలేం. పవన్ కల్యాణ‌్ అన్నారని కాదు కాని.. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విన్పిస్తున్నది ఇదే. జగన్ పాలన పట్ల రెడ్డి సామాజికవర్గం అసంతృప్తిగా ఉందన్నది ఏడాది కాలం నుంచి విన్పిస్తున్న మాట. కేవలం ఆ సామాజికవర్గం నేతలే కాదు ఎక్కువ మందిలో అసహనం కన్పిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
అసంతృప్తి ఉండటం….
నిజంగా అంత ఉందా? అంటే ఏమో కాదనలేని పరిస్థిితి. జగన్ అధికారంలోకి రావడానికి రెడ్డి సామాజికవర్గమూ కారణమే. వారంతా జగన్ ను సీఎం చేయాలని ఆర్థికంగా నష్టపోయారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ వారే కీలకంగా మారి పార్టీ ఆర్థిక భారాన్ని మోశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం మానేశారు. కొందరు ముఖ్యమైన నేతలకు కూడా స్థానిక వైసీపీ నేతలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు.
రెండున్నరేళ్లు అయినా….
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. ఆయన వచ్చీ రాగానే సంక్షేమం పాట అందుకున్నారు. ఓకే దానిని ఎవరూ కాదనలేరు. కానీ అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం వైపు వెళ్లడంతో పనులు జరగడం లేదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది రెడ్డి సామాజికవర్గమే. కాంట్రాక్టర్లలో ఎక్కువ సంఖ్య వారే ఉండటంతో వారంతా అసంతృప్తితో ఉన్నారంటున్నారు. కేవలం కొందరు మాత్రమే జగన్ వల్ల లబ్ది పొందుతున్నారన్న విమర్శలు కూడా ఆ సామాజికవర్గం నుంచే విన్పిస్తున్నాయి.
రాజకీయంగా కూడా….
ఇక రాజకీయాల్లో కూడా అంతే. మంత్రి పదవుల్లో ఆ సామాజికవర్గానికి భారీగా కోతను జగన్ పెట్టారు. జిల్లాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మంత్రి పదవులంటే ఎమ్మెల్యేలే అనుకుందాం. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చి తమను పక్కన పెట్టారన్న అసహనం వారిలో కన్పిస్తుంది. ఆర్థికంగా కూడా తమను ఎదగనివ్వకుండా చేశారన్న అసంతృప్తి అయితే ఉంది. అది తాత్కాలికమేనని, ఎన్నికల సమయానికి వారంతా తిరిగి జగన్ కు చేరువవుతారన్న ధీమా వైసీపీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తుంది.