Ys jagan : జగన్ అనుకున్నట్లే వారిద్దరూ వెళుతున్నారుగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు జగన్ ను ఊహించినట్లే మారుతున్నాయి. ఆయన అనుకున్నట్లే అంతా సవ్యంగా వెళ్లిపోతుంది. జగన్ ట్రాప్ లో మరోసారి టీడీపీ, జనసేన పడినట్లే కన్పిస్తున్నాయి. [more]

;

Update: 2021-10-14 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు జగన్ ను ఊహించినట్లే మారుతున్నాయి. ఆయన అనుకున్నట్లే అంతా సవ్యంగా వెళ్లిపోతుంది. జగన్ ట్రాప్ లో మరోసారి టీడీపీ, జనసేన పడినట్లే కన్పిస్తున్నాయి. ఏ అంశాన్ని ఉపయోగించుకుని గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో దానినే కొంత మార్చి తిరిగి జగన్ ప్రయోగిస్తున్నారు. జగన్ అనుకున్నది అనుకున్నట్లు గ్రౌండ్ అయితే మరోసారి జగన్ కు ఏపీలో విజయం తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కులాలే ముఖ్యం….

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాలు ప్రాధాన్యత పోషిస్తాయి. ఇక్కడ పార్టీల కంటే కులాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఒక కులం ఒకవైపు ఉంటే ఇతర కులం ఏమీ ఆలోచించకుండా ప్రత్యర్థి పార్టీ వైపు చూస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1983 వరకూ ఏపీలో కులాల ప్రభావం లేదు. ఆ తర్వాత నుంచి కుల ప్రభావం ప్రారంభమయింది. ఇక తాజా విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేయాలని జగన్ కోరుకుంటున్నారు.

వారిద్దరూ కలవాలనే….

ఆయన అనుకున్నట్లుగానే సైకిల్ వెళుతుంది. గత ఎన్నికల్లో కమ్మ నాన్ కమ్మ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ సలహా దీని వెనక ఉండి వచ్చు. ఇక ఇప్పుడు అదే జగన్ కమ్మ, కాపులు ఏకమై తనను ఓడించాలని చూస్తున్నారని మిగిలిన కులాలను ఓన్ చేసుకునే యత్నంలో భాగంగానే పవన్ కల్యాణ‌్ పేర్ని నాని చేత రెచ్చగొట్టించారు. పేర్ని నాని కాపు కులంపై చేసిన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ‌్ రెచ్చిపోయారు. కాపులను ఐక్యం చేసే ప్రయత్నం చేశారు.

కుల ముద్ర వేసుకుని మరీ…..

నిజానికి పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ఇప్పటి వరకూ కాపు ముద్ర పడలేదు. రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలతో ఆ ముద్ర కూడా పడినట్లయింది. జగన్ ను ఏపీలో ఓడించాలంటే ఒకే ఒక మార్గం. రెడ్డి నాన్ రెడ్డీస్ గా ప్రజలను విభజించగలిగితే తప్ప అది సాధ్యం కాదు. చంద్రబాబు గతకొద్దిరోజులుగా అదే పనిలో ఉన్నారు. జగన్ రెడ్డి అంటూ ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ వచ్చి చంద్రబాబు చేసే ప్రయత్నాలకు గండికొట్టారు. కమ్మ, కాపు వర్సెస్ ఇతర కులాలుగా మారితే మరోసారి జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జోగయ్య లాంటినేతలు కమ్మ, కాపులకు విరోధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వారిద్దరికీ నష్టమే.

Tags:    

Similar News