Ys jagan : ఇద్దరూ వీర విధేయులే… ఎవరికి పదవి?
జగన్ విధేయులకే అవకాశాలు కల్పిస్తారు. కష్టకాలంలో తన వెంట ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టరు. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు కూడా పార్టీ వీరవిధేయులకు అవకాశం కల్పించారు. విపక్షంలో ఉన్నప్పుడే జంగా [more]
;
జగన్ విధేయులకే అవకాశాలు కల్పిస్తారు. కష్టకాలంలో తన వెంట ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టరు. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు కూడా పార్టీ వీరవిధేయులకు అవకాశం కల్పించారు. విపక్షంలో ఉన్నప్పుడే జంగా [more]
జగన్ విధేయులకే అవకాశాలు కల్పిస్తారు. కష్టకాలంలో తన వెంట ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టరు. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు కూడా పార్టీ వీరవిధేయులకు అవకాశం కల్పించారు. విపక్షంలో ఉన్నప్పుడే జంగా కృష్ణమూర్తి, కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి తాను ఏంటో చెప్పకనే చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు కూడా అంతే. విధేయులకు అవకాశం ఇవ్వాల్సి ఉన్న సామాజిక సమీకరణాలు జగన్ కు అడ్డంకి గా మారనున్నాయి.
అవంతిని తప్పించి…
త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ఈసారి అవకాశం కల్పిస్తారని అనేక మంది భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఇది హాట్ టాపిక్ అయింది. విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి దక్కనుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావును జగన్ తప్పించడం ఖాయమని తేలిపోయింది. మరి ఎవరికి అన్న చర్చ జోరుగా సాగుతుంది. వీరిలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఇద్దరూ జగన్ కు వీరవిధేయులే.
పార్టీని వీడకుండా…
మాడుగుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బూడి ముత్యాలనాయుడు తొలినుంచి జగన్ వెంటే నడిచారు. 2014లో గెలిచినా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోకుండా జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. దీంతో జగన్ ఆయన పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు అధికారంలోకి వచ్చిన వెంటనే విప్ పదవిని ఇచ్చారు. జగన్ ను తాను తొలి నుంచి నమ్ముకుని ఉన్నానని తనకు అన్యాయం చేయరని ఆయన భావిస్తున్నారు.
జగన్ నే నమ్ముకుని….
పాయకరావుపేట నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు. జగన్ కోసం రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చడంతో ఆయన గెలవలేకపోయారు. ఆయనను కాదని చెంగల వెంకట్రావుకు జగన్ టిక్కెట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తిరిగి పాయకరావు పేట నుంచి గెలిచిన గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. ఇటీవల టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. వీరిద్దరూ జగన్ కు నమ్మినబంట్లు. మరి వీరిలో ఒకరికి కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది.