Ys jagan : ఇలాగే ఉంటే… ఇబ్బందులు తప్పవు
జగన్ తనను తాను బలవంతుడు అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే అన్ని సమయాల్లో కేవలం సంక్షేమమే పనిచేయదు. కేవలం కొన్ని వర్గాలనే అండగా [more]
;
జగన్ తనను తాను బలవంతుడు అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే అన్ని సమయాల్లో కేవలం సంక్షేమమే పనిచేయదు. కేవలం కొన్ని వర్గాలనే అండగా [more]
జగన్ తనను తాను బలవంతుడు అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే అన్ని సమయాల్లో కేవలం సంక్షేమమే పనిచేయదు. కేవలం కొన్ని వర్గాలనే అండగా చేేసుకుంటే విజయం దక్కదు. నిజానికి ఇప్పటి వరకూ జగన్ రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన నేత. తన ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే వ్యతిరేకత రావడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని కూడా జగన్ గుర్తించాల్సి ఉంటుంది.
ట్రెండ్ మారింది….
గతంలో మాదిరి ఇప్పుడు రాజకీయాలు లేవు. పాలిటిక్స్ లో ట్రెండ్ మారింది. సోషల్ మీడియా ద్వారా ప్రతి చిన్న విషయమూ ప్రజలకు క్షణాల్లో తెలిసిపోతుంది. దానిని ఎవరికి వారు విశ్లేషణ చేసుకుంటున్నారు. విపక్షాలు సహజంగానే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటాయి. విమర్శలు చేస్తుంటాయి. దానికి ఆధారాలను అడగడం అవివేకం. ఎందుకంటే అవి రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తాయి. అయితే వాటిని ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా జగన్ పై ఉంది.
విపక్షాల విమర్శలను….
జగన్ నోటి నుంచి వచ్చిన మాటలను ప్రజలు విశ్వసించే అవకాశముంది. కానీ జగన్ ఆ ప్రయత్నం చేయడం లేదు. తనపైన కాకున్నా ఎమ్మెల్యేలపై వచ్చిన డ్రగ్స్ వంటి ఆరోపణలపైనైనా జగన్ స్పందించి ఉంటే బాగుండేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో వైసీపీ పై నిరాధార ఆరోపణలను కూడా ప్రజలు నిజమని అనుకునే అవకాశముంది. నిజానికి గత ఎన్నికల సమయంలో జగన్ ను అధికారంలోకి కూర్చోబెట్టింది సోషల్ మీడియానే అని చెప్పాలి.
స్పందించకుంటే….?
టీడీపీకి బలమైన మీడియా ఉంది. జగన్ మీడియాను పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియాతో పాటు జగన్ పెట్టిన మీడియా సమావేశాలు, పాదయాత్ర సందర్భంగా చేసిన ప్రసంగాలు జనంలోకి వెళ్లాయి. కానీ ఇప్పుడు అంతా ఏకపక్షంగానే కన్పిస్తుంది. జగన్ పైనా, పార్టీ నేతలపైనా వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిసినా జగన్ లైట్ తీసుకుంటున్నారు. ఇది చాపకింద నీరులా మారి ముంచే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ జరుగుతున్న ప్రచారంపై జగన్ స్వయంగా స్పందిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.