Ys jagan : జగన్ సన్నిహితులపై దాడులు…. రీజన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసిందా? ఎన్నికలకు ముందు ప్రతి రాష్ట్రంలో అమలు చేసే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తుందా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. [more]

;

Update: 2021-10-08 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసిందా? ఎన్నికలకు ముందు ప్రతి రాష్ట్రంలో అమలు చేసే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తుందా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. వరసగా జగన్ సన్నిహితులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతుండటం ఇందుకు అద్దం పడుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితులైన వారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడానికే ఈ దాడులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తుంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు…..

నిన్నగాక మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులతో వైసీపీ నేతలను కూడా వదిలిపెట్టబోమని బీజేపీ పరోక్షంగా సంకేతాలను పంపింది. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన రాంకీ సంస్థలపై జరిగిన దాడుల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. భారీగా జరిమానా కూడా విధించే అవకాశముందని చెబుతున్నారు.

సన్నిహితుడిగా….

తాజాగా రెండు రోజుల నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పెద్దయెత్తున నగదు దొరికిందని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇరవై బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. పార్థసారధి రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంచి సంబంధాలున్నాయి.

పార్టీకి ఆర్థికంగా…

పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో సంస్థకు విశాఖలోనూ జగన్ ప్రభుత్వం ఇటీవలే స్థలాన్ని కేటాయించింది. టీటీడీలో సభ్యుడిగా కూడా నియమించింది. అత్యంత ధనవంతుడిగా పేరున్న పార్థసారధి రెడ్డి వైసీపీకి ఎన్నికల సమయంలో పెద్దయెత్తున ఆర్థిక సాయం అందిస్తారన్న పేరుకూడా ఉంది. దీంతో బీజేపీ జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుందంటున్నారు. జగన్ సన్నిహితులు మరికొందరిపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని అంటున్నారు.

Tags:    

Similar News