Ycp : ఆ రెండు పదవులను జగన్ రిజర్వ్ చేశారా?
మరోసారి ఏపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనుంది. ఈసారి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను త్వరలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే విశాఖపట్నం పరిధిలోనే [more]
;
మరోసారి ఏపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనుంది. ఈసారి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను త్వరలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే విశాఖపట్నం పరిధిలోనే [more]
మరోసారి ఏపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనుంది. ఈసారి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను త్వరలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే విశాఖపట్నం పరిధిలోనే ఈ పోస్టులను నియమించాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ పూర్తయింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.
ఎందరో ఆశలు…
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పదవులపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం నుంచి అనేక మంది ఈ పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్సీ అంటే ఆరేళ్ల పదవీకాలం ఉండటంతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు అనేక మంది ఇప్పటికే అనేక ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధానంగా ఈసారి జగన్ వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవిని రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు.
ఈయనకు ఒకటి….
వంశీకృష్ణ శ్రీనివాస్ తొలి నుంచి జగన్ తో ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి జగన్ ఆయనకు ఇస్తారనుకున్నారు. కానీ ఇవ్వలేదు. తర్వాత వీజీటీఎం ఛైర్మన్ పోస్టు అయినా ఆయనకు జగన్ ఇస్తారని భావించారు. కానీ జగన్ అక్రమాని విజయనిర్మలకు ఆ పోస్టు కేటాయించడంతో వంశీకృష్ణ శ్రీనివాస్ డల్ అయ్యారు.
మరో పదవిని…..?
ఈ పరిస్థితుల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్ కు రిజర్వ్ చేశారన్న టాక్ ఉంది. యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడంతో ఆయనకు ఖచ్చితంగా ఈ పదవి దక్కుతుందంటున్నారు. ఇక మరో పదవిని దాడి కుటుంబానికి కూడా ఇచ్చే అవకాశముందంటున్నారు. దాడి వీరభద్రరావు కుటుంబం ఎన్నాళ్లగానో పదవుల కోసం నిరీక్షిస్తుంది. ఈసారి వారి కల నెరవేరుతుందంటున్నారు. మొత్తం మీద విశాఖపట్నంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పోస్టులను జగన్ వీరిద్దరికీ రిజర్వ్ చేసినట్లు పార్టీలో టాక్ నడుస్తుంది.