Ys jagan : అదే మంచిదట.. అలా జరగాలనే కోరుకుంటున్నారట
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన నినాదాన్ని రెడీ చేేశారు. ప్రత్యేకహోదా వంటి విషయాలను పక్కన పెట్టి మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వచ్చే ఎన్నికలకు [more]
;
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన నినాదాన్ని రెడీ చేేశారు. ప్రత్యేకహోదా వంటి విషయాలను పక్కన పెట్టి మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వచ్చే ఎన్నికలకు [more]
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన నినాదాన్ని రెడీ చేేశారు. ప్రత్యేకహోదా వంటి విషయాలను పక్కన పెట్టి మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వచ్చే ఎన్నికలకు హైలెట్ చేయనున్నారు. తాను అభివృద్ధికి నడుంబిగిస్తే విపక్షం అన్ని రకాలుగా అడ్డుకుందని జగన్ ఆరోపించనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తాను తెచ్చినా అమలులోకి రానివ్వకుండా న్యాయపరంగా అడ్డుకుంటున్నారన్నది జగన్ ప్రధాన ఆరోపణ. ఈ అంశమే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రధాన నినాదంగా మారనుంది.
మూడు రాజధానులు…
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించిన తర్వత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. శాసనసభలో ఆమోదించారు. కానీ చట్టపరంగా సమస్యలున్నాయి. ఇప్పట్లో తేలే అవకాశం లేదు. ఇక మూడేళ్లలో రాజధాని తరలింపు కూడా సాధ్య కాదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చివరి రెండేళ్లు రాజధాని అమరావతి అంటూ హడావిడి చేశారు. అయితే ఇప్పుడు జగన్ కూడా చివరి రెండేళ్లు రాజధానుల అంశంపైనే ఫోకస్ పెంచే అవకాశముంది.
మూడేళ్లు కావస్తున్నా….
జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడేళ్లు పూర్తి కావస్తుంది. మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ మూడేళ్లలో రాజధాని విషయం ఓ కొలిక్కి వస్తుందని చెప్పలేం. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల హడావిడే ఉంటుంది. అంటే మరో ఏడాది మాత్రమే రాజధాని ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం ఉంది. కానీ న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నందున ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. విశాఖకు పరిపాలన రాజధానిని కూడా తరలించలేని పరిస్థితి.
వచ్చే ఎన్నికల నాటికి….
ఇక కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న న్యాయరాజధానిని కర్నూలుకు తరలించే అవకాశమే లేదు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ వచ్చే ఎన్నికలకు పూర్తి కాదు. అయితే ఇది తన తప్పు కాదని, తాను సిన్సియర్ గా ప్రయత్నించినా, విపక్షాలు చట్టాలు, కోర్టుల పేరిట అడ్డుకున్నాయని జగన్ జనం ముందుకు వెళతారు. ఒకే చోట అభివృద్ధి వల్ల ఇతర ప్రాంతాలు నష్టపోతాయని ప్రచారం చేస్తారు. జగన్ కు ఒకరకంగా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి కాకపోవడమే మంచిదంటున్నారు. మూడు ప్రాంతాల్లో వైసీపీకి బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.