Ys jagan : మైకు మూడు సార్లు తట్టి.. మీ ఇల్లు ఆపిందెవరమ్మా?

జగన్ కు అన్నీ కలసి వచ్చేటట్లే కన్పిస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పులు కూడా వచ్చే ఎన్నికలకు జగన్ కు అనుకూలంగా మారనున్నాయి. న్యాయస్థానాల తీర్పులకు, ప్రజాతీర్పులకు భిన్నంగా ఉంటుంది. [more]

;

Update: 2021-10-09 15:30 GMT

జగన్ కు అన్నీ కలసి వచ్చేటట్లే కన్పిస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పులు కూడా వచ్చే ఎన్నికలకు జగన్ కు అనుకూలంగా మారనున్నాయి. న్యాయస్థానాల తీర్పులకు, ప్రజాతీర్పులకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటారు. చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలను న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతారు.

ఇళ్ల నిర్మాణంపై…..

వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడానికే తొలుత ప్రాధాన్యత ఇస్తారు. ఈ పిటీషన్ ను తెనాలికి చెందిన కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు. లబ్దిదారులు న్యాయవాదులు ఫీజు చెల్లించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. దీని వెనక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. తెనాలికి చెందిన సాధారణ లబ్దిదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఖర్చు భరించే పరిస్థితుల్లో ఉండరన్నది వైసీపీ వాదన.

గత ప్రభుత్వాలు….

ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్ లు విపక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. ఇన్నేళ్ళుగా ప్రభుత్వాలు పేదలకు నిర్మిస్తున్న ఇళ్ళు రెండు గదులు. ఒక్కో గది 10×10 చొప్పున 100 చదరపు అడుగులు. రెండు గదులు కలిపి 200 చదరపు అడుగులు. లేదు అధికంగా ఒక గది 12×12 అనుకుంటే 144 చదరపు అడుగులు. రెండో గది ఖచ్చితంగా 10×10 మించి ఉండదు. అంటే రెండు గదులు కలిపి 244 చదరపు అడుగులు. లేదూ రెండో గది కూడా 12×12 సైజే అనుకుంటే మొత్తం 288 చదరపు అడుగులు.అది కూడా సొంత ఇంటిస్థలం ఉంటేనే.

మైకు పట్టుకుని మూడు సార్లు తట్టి…..

ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టింది పట్టణాల్లో 435.56 చదరపు అడుగులు. గ్రామాల్లో 653.34 చదరపు అడుగులు. కొత్తగా ఇంటి స్థలంతో సహా. పేదలు ఆ ఇంటి నిర్మాణానికి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కావాలనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో జగన్ మైక్ తీసుకోని మూడు సార్లు మైకును తట్టి ఊరు పేరు చెప్పి.. మీ ఇల్లు ఆపింది ఎవరమ్మా అని పెద్దగా అరిచి అడుగుతాడు.. అప్పుడు చెబుతారు జనాలు సమాధానం. అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News