Ys jagan : జగనూ.. ఆ రెండు రివర్స్ అయితే?
కులాలు అన్ని సమయాల్లో అండగా నిలుస్తాయా? కులం కూడు పెడుతుందా? అన్న సామెత ఒకటుంది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కులాల లెక్కలు అన్ని సార్లు [more]
;
కులాలు అన్ని సమయాల్లో అండగా నిలుస్తాయా? కులం కూడు పెడుతుందా? అన్న సామెత ఒకటుంది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కులాల లెక్కలు అన్ని సార్లు [more]
కులాలు అన్ని సమయాల్లో అండగా నిలుస్తాయా? కులం కూడు పెడుతుందా? అన్న సామెత ఒకటుంది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కులాల లెక్కలు అన్ని సార్లు పనిచేయవు. ఇందుకు అనేక ఉదాహరణలు గత ఎన్నికల్లో చూశాం. వేవ్ ను బట్టి, మూడ్ ను బట్టి జనం ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు జగన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాలు, కులాల వారీగా గుప్పించిన నగదును లెక్క వేసుకుంటే రివర్స్ కాక తప్పదు.
పథకాలతో…
కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసి వారు సంతృప్తి చెందారనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ప్రతి రోజూ ఇల్లు గడవాలి. తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. ఖర్చు తగ్గాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఆదయం జానెడుంటే.. ఖర్చు బారెడంత ఉంటుంది. అన్నీ ధరలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదు. దీంతో జగన్ పై పేద, మధ్య తరగతి వర్గాల్లో అసంతృప్తి ఉందన్నది వాస్తవం.
మూడ్ ఛేంజ్ చేయగలిగితే….?
కానీ ఈ నిజాన్ని జగన్ కు చేరవేసే వారేరీ? ఆయనకు అంతా వెలిగిపోతుంది అన్న నివేదికలే అందుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మామూలుగా లేవు. నెలకు పింఛను అందుతున్నా, రేషన్ అందుతున్నా, అమ్మవొడి ఇంటికొస్తున్నా ఎన్నికల సమయానికి అవి పనిచేయవు. ఒక వేవ్ కావాలి. ప్రజల మూడ్ ను ఛేంజ్ చేయగలగాలి. అప్పుడు ఏ పార్టీ అయినా విజయం దక్కించుకోగలుగుతుంది.
కులాలు ఓట్లు రాలుస్తాయా?
జగన్ ను చూస్తుంటే కేవలం కులాలు, సంక్షేమ పథకాలనే తనను గట్టెక్కిస్తాయని భావిస్తున్నట్లుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిలు తన వైపు ఉంటారన్న ధీమాలో ఉన్నారు. అలాగే బీసీల్లో కూడా అత్యధిక శాతం మంది తనవైపు ఉంటారన్న నమ్మకం ఆయనకు ఉంది. కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అభివృద్ధి లేకపోవడం వంటి కారణాలతో కులాల పరంగా కూడా లెక్కలు కలసి రాకపోవచ్చు. అందుకే జగన్ ముందుగానే మేల్కొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.