Ys jagan : పీకే టీం సమన్వయ బాధ్యత వైసీపీలో ఆయనదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన పదవిని పదిలం చేసే పనిలో ఉన్నారు. ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే [more]

;

Update: 2021-10-28 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన పదవిని పదిలం చేసే పనిలో ఉన్నారు. ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. సంక్షేమం మాత్రం ప్రజలకు చేరువయింది. అదొక్కటే గెలుపుకు సరిపోదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకోవాలని ఉన్నా అందుకు అధికారులు, పార్టీ నేతలపైనే ఆధారపడాల్సి ఉంది. ఆ నివేదికలను విశ్వసనీయత ఉందా? లేదా? అన్నదే ప్రశ్న.

ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని….

అందుకే దాదాపు రెండున్నరేళ్లు ముందుగానే ప్రశాంత్ కిషోర్ టీం ను జగన్ రంగంలోకి దించుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ పీకే టీం వచ్చి సెటిల్ అయి నివేదికలు ఇవ్వడం ప్రారంభించే సమయానికి మరో ఆరు నెలలు పడుతుంది. అంటే అప్పటికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉంటుంది. ఈ రెండేళ్లలో తనకు పీకే టీం నుంచి వచ్చే నివేదికలను బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవచ్చన్నది జగన్ ఆలోచనగా ఉంది.

మూడేళ్ల ముందే…..

2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇలాగే చేశారు. దాదాపు మూడేళ్ల ముందు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. పీకే టీం చెప్పినట్లుగానే చేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా వారు సూచించిన విధంగానే చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆబ్లిగేషన్ తో కొంత సడలింపు ఇచ్చినా అధిక సంఖ్యలో పీకే టీం ఇచ్చిన నివేదిక ప్రకారమే అభ్యర్థుల ఎంపికలో జగన్ ఫాలో అయ్యారు.

సమన్వయ బాధ్యతను….

ఇప్పుడు పీకే టీంతో సమన్వయ బాధ్యతను వైసీపీలోని కీలక నేతకు జగన్ అప్పగించనున్నారు. వారు ఇచ్చే నివేదికను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తనకు తెలిపే విధంగా జగన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా విపక్షాలు తన ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేవిధంగా కూడా పీకే టీం పనిచేయనుంది. ఈ బాధ్యతను కూడా జగన్ పీకే టీంకు అప్పగించనున్నారు. వైసీపీ సోషల్ మీడియాతో పాటు పీకే టీం ఇక విపక్షాల విమర్శలకు నెట్టింట సమాధానం చెప్పనుంది. మొత్తం మీద జగన్ మరోసారి గెలిచేందుకు గ్రౌండ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News