Ys jagan : పార్టీ ప్రక్షాళలన కూడా మొదలెట్టేస్తారట
వైఎస్ జగన్ ఎన్నికల ముందు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బహుశా మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత జగన్ పార్టీలోనూ కీలక మార్పులు చేసే అవకాశముందని [more]
;
వైఎస్ జగన్ ఎన్నికల ముందు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బహుశా మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత జగన్ పార్టీలోనూ కీలక మార్పులు చేసే అవకాశముందని [more]
వైఎస్ జగన్ ఎన్నికల ముందు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బహుశా మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత జగన్ పార్టీలోనూ కీలక మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. జగన్ ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం, పాలనపైనే దృష్టి పెట్టారు. పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అనేక ప్రాంతాల్లో పార్టీలో విభేదాలు తలెత్తినా ముఖ్యమైన విషయాల్లోనే జోక్యం చేసుకున్నారు. రాజమండ్రిలో జక్కంపూడి, మార్గాని భరత్, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, సునీల్ రెడ్డి వివాదంలో మాత్రమే జోక్యం చేసుకున్నారు.
ఎన్నికల తర్వాత….
అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బాధ్యతలను పూర్తిగా నేతలకే అప్పగించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డికి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతను వైవీ సుబ్బారెడ్డి, రాయలసీమ మిగిలిన ఇతర జిల్లాల బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఆ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను వారే పర్యవేక్షించాలి. అక్కడ పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది కాలంలో వీరు పరిష్కరించినవి అతి తక్కువేనని చెప్పాలి.
ముగ్గురూ రెడ్లే……
ఇక ముగ్గురూ రెడ్డి సామాజికవర్గానికే బాధ్యతలను అప్పగించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. మూడు ప్రాంతాలు ముగ్గురు రెడ్లకు అమ్మకం పెట్టారని విపక్షం సయితం ఆరోపించింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ ఈ మూడు ప్రాంతాల్లో మరో ముగ్గురు సీనియర్లను నియమించే అవకాశముందని తెలిసింది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం కూడా ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో త్వరలోనే వీరిని మారుస్తారని చెబుతున్నారు.
సీనియర్ నేతలకు…
మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటున్న జగన్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను ధర్మాన ప్రసాదరావుకు అప్పగించే ఆలోచన ఉంది. ఇక రాయలసీమ నాలుగు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డిని, గుంటూరు, కృష్ణా జిల్లాలకు కమ్మ సామాజికవర్గం నేతకు బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారు. పార్టీ కార్యవర్గాన్ని కూడా పూర్తిగా మార్చివేయాలన్న నిర్ణయాన్ని జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.