Ys jagan : బ్లూ ప్రింట్ రెడీ అట… రూట్ మ్యాప్ అదిరిందట

వైసీపీ చీఫ్ గా జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్దమవ్వాలో ఆయన ఇప్పటికే బ్లూప్రింట్ ను రెడీ చేశారు. విపక్షాలు దరిదాపుల్లేకుండా చేసేందుకు [more]

;

Update: 2021-10-29 02:00 GMT

వైసీపీ చీఫ్ గా జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్దమవ్వాలో ఆయన ఇప్పటికే బ్లూప్రింట్ ను రెడీ చేశారు. విపక్షాలు దరిదాపుల్లేకుండా చేసేందుకు రానున్న మూడేళ్లు పక్కా ప్రణాళికతో జగన్ ముందుకు వెళ్లనున్నారు. జగన్ ను మొన్నటి వరకూ ఒక పారిశ్రామికవేత్తగానే చూశారు. కానీ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో ఆయన ఫక్తు రాజకీయ నేతగా మారిపోయారు. ప్రతి నిర్ణయం పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టేదే అవుతుంది.

లైట్ గా తీసుకున్నా….

చంద్రబాబు తొలినాళ్లలో జగన్ ను లైట్ గా తీసుకున్నారు. ఏపీ జనం జగన్ ను నమ్మరనుకున్నారు. లక్షల కోట్లు అవినీతి ఆరోపణలు చేశారు. అందుకే ఏపీకి తాను తప్ప జగన్ కు అవకాశమే లేదని చంద్రబాబు గట్టిగా విశ్వసించారు. కానీ జగన్ చంద్రబాబు అంచనాలకు మించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేవారు.

అసలు లేనట్లే…

కానీ జగన్ మాత్రం అసలు విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆ పార్టీ చేసే ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బహుశ తనపై తనకు నమ్మకం కావచ్చు. చంద్రబాబు మాటలను జనం విశ్వసించరన్న కాన్ఫిడెన్స్ వల్లనో తెలియదు కాని చంద్రబాబు చేసే ఒక్క ఆరోపణకు కూడా జగన్ నుంచి కౌంటర్ రాలేదు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ కొత్త హామీలతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.

కొత్త పథకాలతో….

ఇప్పటికే పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ ఇచ్చిన హామీలను 90 శాతం జగన్ అమలు చేశారు. మరోమూడేళ్లు సమయం ఉండటంతో వాటిని కూడా పూర్తి చేస్తారు. దీని తర్వాత కొత్త పథకాల రూపకల్పనకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. ప్రధానంగా బడుగు వర్గాలకు అండగా ఈ పథకాలు రూపుదిద్దుకోనున్నాయి. రైతులు, బడుగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా కొత్త పథకాలకు మరికొద్ది రోజుల్లోనే జగన్ శ్రీకారం చుడతారంటున్నారు. అలా పథకాలతోనే జగన్ సీఎం కూర్చీకి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News