Ys jagan : మళ్లీ ముహూర్తం పెడతారా….?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించాక ఇప్పటికి మూడు దసరాలు ముగిశాయి. ఈసారి దసరాకు కూడా విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాలేదు. శాసనసభలో జగన్ మూడు [more]

;

Update: 2021-10-21 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించాక ఇప్పటికి మూడు దసరాలు ముగిశాయి. ఈసారి దసరాకు కూడా విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాలేదు. శాసనసభలో జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఉగాది, దసరాలు ఎన్నో వెళ్లిపోయాయి. ప్రతి సారి రాజధాని తరలింపు సాధ్యం కాకపోయినా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయాన్ని తరలిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయినా సాధ్యం కాలేదు.

అంతా తాడేపల్లి నుంచే….

గత రెండున్నరేళ్లుగా వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప కార్యాలయం నుంచే తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సచివాలయానికి మంత్రివర్గ సమావేశాలు ఉంటే తప్ప వెళ్లడం లేదు. క్యాంపు కార్యాలయం నుంచే లబ్దిదారులకు బటన్ నొక్కి నగదును విడుదల చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు కూడా అక్కడి నుంచే. అయితే ఈసారి క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించి అక్కడి నుంచి కార్యకలాపాలు చేస్తారని చెప్పారు.

అప్పట్లో అలా…

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ప్రచారం సాగింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఒక భవనాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం కోసం చూశారని కూడా వార్తలొచ్చాయి. అప్పట్లో సీఎంవోలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ సయితం విశాఖను సందర్శించారు. ఇంకేముంది జగన్ విశాఖలో కాలుమోపడానికి ముహూర్తమే తరువాయి అని వైసీపీ నేతలు ఆర్భాటపు ప్రకటన చేశారు.

మరో రెండేళ్లే…..

అయితే అమరావతి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నందున కనీసం క్యాంప్ కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించే సాహసాన్ని జగన్ చేయలేకపోతున్నారు. పరిపాలన రాజధాని తరలింపు మూడేళ్ల పాటు సాధ్యం కాలేదు. వచ్చే రెండేళ్లలో కూడా తరలించకపోతే జగన్ చేసిన ప్రకటనకు విలువ ఉండదు. అందుకే విశాఖ వైసీపీ నేతలు క్యాంప్ కార్యాలయాన్ని అయినా తరలించాలని కోరుతున్నారు. మరి ఈ రెండేళ్లలో అది సాధ్యమవుతుందా? అన్నది సందేహమే.

Tags:    

Similar News