Ys jagan : ఇక్కడ ఈక్వేషన్లు మామూలుగా లేవుగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో తన కేబినెట్ ను విస్తరించనున్నారు. సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఉపయోగపడే వారికి, పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే [more]

;

Update: 2021-10-30 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో తన కేబినెట్ ను విస్తరించనున్నారు. సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఉపయోగపడే వారికి, పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే వారికి జగన్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. అయితే కొన్ని జిల్లాలు మాత్రం సామాజిక సమీకరణాల పరంగా, సీనియారిటీ పరంగా, విధేయత వంటి కారణాలు జగన్ ను ఇబ్బంది పెడుతున్నాయి. మంత్రి పదవి ఇవ్వడానికి అందరూ అర్హులే. కానీ ఎవరికి ఇవ్వాలన్నది జగన్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

రెండు పదవులు….

గుంటూరు జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవుల విషయంలో జగన్ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఎందుకంటే పెద్ద జిల్లాతో పాటు గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తెచ్చి పెట్టిన జిల్లా. రాజధానిగా అమరావతిని తరలిస్తామని చెప్పినప్పటికీ జగన్ వైపు గుంటూరు జిల్లా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అండగా నిలిచారు. అందుకే గుంటూరు జిల్లాకు జగన్ మంత్రి పదవుల విష‍యంలో ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.

అందరూ సీనియర్లే….

తొలి మంత్రి వర్గ విస్తరణలో మోపిదేవి వెంకటరమణతో పాటు మేకతోటి సుచరితను మంత్రి పదవి వరించింది. శాసనమండలి రద్దు చేస్తున్నామనన ప్రకటనతో మోపిదేవిని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు సుచరిత ఒక్కరే జిల్లాలో మంత్రిగా ఉన్నారు. సుచరితను తప్పించినా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. రెడ్డి సామాజికవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందు వరసలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గంలో కోన రఘుపతి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

ఎవరిని కాదన్నా…..

ఇక పార్టీలో సీనియర్ గా, నమ్మకమైన నేతగా ఉన్న అంబటి రాంబాబు కూడా జగన్ తనకు మంత్రి పదవి ఇస్తారన్న ఆశలు పెట్టెుకున్నారు. కాపు కోటాలో ఆయన తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఇక మైనారిటీ కోటాలో ముస్తాఫాకు గ్యారంటీ అన్న టాక్ వినపడుతుంది. అయితే ఇంతమందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ముస్తాఫా కు మంత్రి పదవి ఇస్తే ఇంకొకటి మాత్రమే మిగులుతుంది. అప్పుడు సీనియర్లకు అన్యాయం చేసినట్లవుతుంది. దీనిపై జగన్ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News