Ys jagan : శత్రువులంతా చుట్టుముడుతున్నారు.. ప్రమాదమే మరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శత్రువులు పెరుగుతున్నారు. వారు ప్రమాదకరమని ఆయన గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ జగన్ పై చంద్రబాబు, టీడీపీ, పవన్ కల్యాణ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శత్రువులు పెరుగుతున్నారు. వారు ప్రమాదకరమని ఆయన గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ జగన్ పై చంద్రబాబు, టీడీపీ, పవన్ కల్యాణ్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శత్రువులు పెరుగుతున్నారు. వారు ప్రమాదకరమని ఆయన గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ జగన్ పై చంద్రబాబు, టీడీపీ, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అది రాజకీయమే అని భావిస్తున్నారు. 2014కు ముందునుంచి జగన్ పై ఇలాంటి మాటలు దాడి జరుగుతుంది. అయితే జనం నమ్మకుండా 2014లో 60కి పైగానే సీట్లు ఇచ్చారు. 2019లో 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.
వీరిని పట్టించుకోకపోయినా….
అందుకే జగన్ చంద్రబాబు విమర్శలను అస్సలు పట్టించుకోరు. పవన్ కల్యాణ్ వైపు చూడను కూడా చూడరు. వారిద్దరి పై జగన్ కు అంత నమ్మకమనుకోవాలి. నిజమే కాబోలు. ఎందుకంటే వరసగా జరిగిన ఎన్నికల్లో జనం జగన్ వైపే నిలచారు కాని విపక్షాల విమర్శలను తమ ఓట్ల ద్వారా తిరస్కరించారు. ఇక గత ఏడాది కాలంగా వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు కూడా కేర్ చేయడం లేదు.
ఉండవల్లి లాంటి వారు….
కానీ ఇక తప్పదు ఒక వైపు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వంపై సూటి విమర్శలు చేస్తున్నారు. ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఉండవల్లి అరుణ కుమార్ వైఎస్ కు అత్యంత సన్నిహితుడు. ఆయనపై ఏ పార్టీ ముద్ర లేదు. ఆయన విమర్శలను, ఆరోపణలను జనం సీరియస్ గా తీసుకుంటారు. అందులో వాస్తవం ఉందని నమ్ముతారు. ఇది ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని డ్యామేజీ చేస్తుంది.
డీల్ తరహాలోనే….
మరోవైపు ఇటీవలే డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ వ్యతిరేక గళం విప్పారు. డీఎల్ ది నిలకడలేని మనస్తత్వం అని తెలిసినా ఆయన చేసే విమర్శలు జనంలోకి వెళతాయి. ఆయన రెడ్డి సామాజికవర్గం నేత. ఎన్నికల నాటికి మరికొందరు తటస్థ రెడ్డి నేతలు జగన్ ను టార్గెట్ చేసే అవకాశముంది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ ల మాదిరి వీళ్లను తేలిగ్గా తీసుకునే వీలుండదు. ఎందుకంటే వీరంతా వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన వారు. మూడేళ్ల జగన్ పాలన చూసిన తర్వాత రియాక్ట్ అవుతుంటే అందులో ఎంతోకొంత నిజముందనుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా జగన్ కు జరిగే నష్టమేమ కాని, చంద్రబాబుకు మాత్రం లాభిస్తుంది.