Ys jagan : నవరత్నాలు సరే… ఈ తప్పులమాటేమిటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. జగన్ పాలన ఎలా ఉంది అన్న ప్రశ్నకు పెదవి విరుపులే సమాధానాలుగా వస్తున్నాయి. మధ్యతరగతి నుంచి ఉద్యోగుల [more]

Update: 2021-10-25 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. జగన్ పాలన ఎలా ఉంది అన్న ప్రశ్నకు పెదవి విరుపులే సమాధానాలుగా వస్తున్నాయి. మధ్యతరగతి నుంచి ఉద్యోగుల వరకూ పాలనపై సంతృప్తికరంగా లేరు. ప్రజాధనాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారని, అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు జగన్ బాగా ఎదుర్కొంటున్నారు. ఇందులో జగన్ తప్పిదం కూడా లేకపోలేదు. నవరత్నాలపై పెట్టిన శ్రద్ధ, అభివృద్ధిపై పెట్టలేదన్నది వాస్తవం.

అభివృద్ధి లేక…

దీనిని వైసీపీ నేతలు కూడా కాదనలేరు. రాష్ట్రం పారిశ్రామికంగా గత రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తద్వారా ఉపాధి అవకాశాలు లేవు. కరోనా వల్ల ఏడాదిన్నర కోల్పోయామని వైసీపీ నేతలు చెబుతున్నా ఎన్నికల సమయానికి ఈ సర్ది చెప్పుకోవడాలు చెల్లుబాటు కావు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన పరిశ్రమలే ఇప్పుడు ఏపీ ప్రజలకు కన్పిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా జగన్ కు మైనస్ పాయింట్ అవుతుంది.

అప్పులు చేసి మరీ…

జగన్ నవరత్నాలను అమలు చేయడానికి పూర్తి స్థాయి కృషి చేశారు. తొమ్మిది అంశాల్లో ఒక్క మద్యనిషేధం తప్ప మిగిలిన ఎనిమిది అంశాల్లో జగన్ సక్సెస్ అయినట్లే. అప్పులు తెచ్చి మరీ పంచుతున్నారు. దీనివల్ల తాను కొన్ని లక్షల కుటుంబాలకు చేరువయ్యానని, ఎన్నికల వేళ తనకు కలసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసుల వల్ల కావచ్చు. తీర్పుల వల్ల కావచ్చు కొన్ని నిర్ణయాలను అమలు చేయలేకపోయారు. అయితే జగన్ తాను హామీ ఇచ్చిన నవరత్నాలను అమలు చేయడానికి మరో తొమ్మిది తప్పులు చేశారన్నది వాస్తవం.

నవరత్నాలు ఇవే….

1.వైఎస్ఆర్ రైతు భరోసా
2.ఫీజు రీయింబర్స్‌మెంట్
3.ఆరోగ్యశ్రీ
4.జలయజ్ఞం
5.మద్యపాన నిషేధం
6.అమ్మ ఒడి
7.వైఎస్ఆర్ ఆసరా
8.పేదలందరికీ ఇళ్లు
9.పెన్షన్ల పెంపు

నవ తప్పులు ఇవే….

1. జనాలకు దూరంగా ఉండటం
2. నేతలకు అందుబాటులో లేకపోవడం
3. అభివృద్ధి జాడ కన్పించకపోవడం
4. పార్టీని గాలికి వదిలేయడం
5. కులాల వారీగా పదవులను కేటాయించడం
6. ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం
7. పార్టీ నేతలలో విభేదాలు
8. కేంద్రానికి మద్దతు.. రాష్ట్ర ప్రయోజనాలు సాధించకపోవడం
9. అధికారులపై ఆధారపడటం

Tags:    

Similar News