Ys jagan : ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్… ఇక అంతా హ్యాపీయేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు సిద్దమయ్యారు. సంక్షేమ పథకాలను అమలు, ప్రజల సంతృప్తిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు సిద్దమవుతున్నారు. ఇన్నాళ్లూ తాడేపల్లి సీఎం [more]

;

Update: 2021-10-25 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు సిద్దమయ్యారు. సంక్షేమ పథకాలను అమలు, ప్రజల సంతృప్తిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు సిద్దమవుతున్నారు. ఇన్నాళ్లూ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికే పరిమితమై, అధికారుల నుంచి నివేదికలు అందుకుంటున్న జగన్, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

రెండున్నరేళ్లుగా….

దాదాపు రెండున్నరేళ్లుగా జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలతో కూడా ఆయన కలవడం లేదు. జిల్లాలకు వెళ్లినప్పుడు మినహా ఎమ్మెల్యేలు జగన్ ను కలుసుకోవడమూ కష్టంగా మారింది. తమ నియోజకవర్గంలో సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. లేకుంటే సీఎంవో కార్యాలయాన్ని సంప్రదించాల్సి వస్తుంది. జగన్ జిల్లాల పర్యటనకు ఎప్పుడు వస్తారా? అని ఎమ్మెల్యేలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

వన్ టూ వన్….

ఎమ్మెల్యేలతో జగన్ వన్ టూ వన్ మాట్లాడే కార్యక్రమం ప్రారంభమయింది. ఇప్పటికే కొందరి ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటు పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్న విషయంపైనా జగన్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఇప్పటికే జగన్ సమావేశమయ్యారు.

రచ్చబండతో పాటు….

ఇక వరసగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు. తాను రచ్చ బండ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. అంటే జనంలోకి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈలోపే ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు హ్యాపీ ఫీలవుతున్నారు. నియోజకర్గంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుపై కూడా జగన్ దృష్టి పెట్టారు. ఈ మూడేళ్లలో ఆ హామీలను కూడా అమలు చేయనున్నారు.

Tags:    

Similar News