Ys jagan : జగన్ ఆశ్రమాల బాట… రీజన్ అదేనా?
వైఎస్ జగన్ మూడేళ్లకు ముందే పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఆయన వేసే ప్రతి అడుగు ఎన్నిక కోసమేనన్నది స్పష్టమవుతుంది. తన మీద ఉన్న స్టాంప్ [more]
;
వైఎస్ జగన్ మూడేళ్లకు ముందే పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఆయన వేసే ప్రతి అడుగు ఎన్నిక కోసమేనన్నది స్పష్టమవుతుంది. తన మీద ఉన్న స్టాంప్ [more]
వైఎస్ జగన్ మూడేళ్లకు ముందే పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఆయన వేసే ప్రతి అడుగు ఎన్నిక కోసమేనన్నది స్పష్టమవుతుంది. తన మీద ఉన్న స్టాంప్ లను తొలగించే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకే ఆయన ఆశ్రమాల బాట పట్టారు. గతానికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తుండటం ఎన్నికల కోసమేనన్నది అర్థమవుతుంది. ప్రత్యర్థులు సయితం ఆశ్చర్యపోయేలా జగన్ అడుగులు పడుతున్నాయి.
ఆ ముద్ర నుంచి….
జగన్ మీద క్రిస్టియన్ ముద్ర ఉంది. ఆయన ఆ మతాన్ని నమ్ముతారు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ బీజేపీ, టీడీపీలు ఇటీవ కాలంలో జగన్ హిందూ వ్యతిరేకి అన్న ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయాపై దాడులు, రథం దగ్దం సంఘటనలు వైసీపీిని రాజకీయంగా ఇరకాటంలో పడేశాయి. రానున్న మూడేళ్లలో ఇలాంటి విమర్శలను ప్రత్యర్థి పార్టీలు విస్తృతంగా చేసే అవకాశముంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ఫోకస్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.
ప్రత్యేకంగా ఏమీ లేకున్నా…..
ఈ నేపథ్యంలో జగన్ ఆశ్రమాలను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ పటమట దత్తనగర్ లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించడాన్ని ఈ కోవలోనే చూడాలి. అక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏవీ లేవు. స్వామి వారిని కలిసేందుకే జగన్ అక్కడకు వెళ్లారు. 2014లో ఓటమి పాలయిన దగ్గర నుంచి జగన్ లో మార్పు వచ్చింది. విశాఖ శారదాపీఠం స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించారు.
మూడేళ్ల సమయం ఉన్నా…
జగన్ విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర చెప్పినట్లు అనేక పూజలు చేశారు. గంగాస్నానం చేశారు. 2019 ఎన్నికలకు ముందు తాను హిందూ వ్యతిరేకిని కాదని చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు గణపతి సచ్ఛిదానంద స్వామీజీని కలవడం కూడా అందులో భాగమే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధితో పాటు అనేక ఆలయాలను జీర్ణోద్ధరణ గావించానని జగన్ చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నా జగన్ మాత్రం ఆశ్రమాల బాట పట్టడం చర్చనీయాంశమైంది.