Ys jagan : జగన్ మరో ప్రయోగం.. వారిలో చీలిక తెస్తారా?
వైసీపీ అధినేతగా జగన్ మరోసారి తన పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలు తెలియదు. జనానికి జగన్ మాత్రమే [more]
;
వైసీపీ అధినేతగా జగన్ మరోసారి తన పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలు తెలియదు. జనానికి జగన్ మాత్రమే [more]
వైసీపీ అధినేతగా జగన్ మరోసారి తన పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలు తెలియదు. జనానికి జగన్ మాత్రమే కన్పిస్తున్నారు. అది సంక్షేమ పథకాల వల్ల కావచ్చు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల కావచ్చు. జగన్ పూర్తిగా జనంలో ఉన్నారన్నది వాస్తవం. జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించకపోయినా ఆయన పథకాలు, విడుదల చేస్తున్న నిధులు మాత్రం జనం వద్దకు జగన్ ను నేరుగా చేర్చాయి.
గెలిచినా.. ఓడినా…
దీంతో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో జగన్ కు పనిలేదు. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలిచినా, ఓడినా దానికి కారణం జగన్. అందుకే జగన్ ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారంటున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం బలంగా ఉన్న చోట వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఎటూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులకే టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల మాత్రమే కాపుల ప్రభావం ఉంటుంది.
దశాబ్దాల నుంచి…..
అనంతపురం పట్టణ నియోజకవర్గంలోనూ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా రెండు దశాబ్దాలుగా ఇక్కడ రెడ్డి, కమ్మ సామాజికవర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరి విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అనంతకు నో టిక్కెట్…
ఈ నేపథ్యంలో అనంతపురం పట్టణ నియోజకవర్గంలో ఈసారి కాపు సామాజికవర్గానికే జగన్ టిక్కెట్ కేటాయిస్తారంటున్నారు. అనంత వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. బలమైన కాపు సామాజికవర్గం నేతకు ఈసారి జగన్ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. అదే జరిగి విజయం సాధిస్తే దశాబ్దాల తర్వాత కాపు నేత ఎమ్మెల్యే అవకాశాలున్నాయంటున్నారు. కాపు సామాజికవర్గంలో చీలిక తేవడానికి జగన్ ఈ ప్రయోగానికి దిగారంటున్నారు.