Ys jagan : జగన్ పై ఫెయిల్యూర్ ముద్ర పడిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ అనుభవం లేకపోయినా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. కానీ ఏనాడూ పాలనను సజావుగా చేసుకోనిచ్చిన [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ అనుభవం లేకపోయినా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. కానీ ఏనాడూ పాలనను సజావుగా చేసుకోనిచ్చిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏ అనుభవం లేకపోయినా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. కానీ ఏనాడూ పాలనను సజావుగా చేసుకోనిచ్చిన పరిస్థితి లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీడీపీ మొదలు పెట్టింది. వ్యవస్థలను అడ్డం పెట్టకుని పాలనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు తాను తప్ప మరెవ్వరూ ముఖ్యమంత్రిగా ఉండటానికి వీలులేదన్న ధోరణి పార్టీ అధినేతలో కన్పిస్తుంది.
అనుభవం లేకున్నా….
జగన్ కు నిజంగా పాలన అనుభవం లేదు. తొలిసారి ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకాల అమలుతో ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు. తొలి నాటి నుంచే జగన్ ప్రతి అడుగూ వచ్చే ఎన్నికల వైపుగానే ఉంది. దీనిని చంద్రబాబు సయితం ఊహించలేదు. కొత్త కాబట్టి ఆయన దాదాపు ఆరు నెలల పాటు గమనించారు. ఇక టీడీపీ నేతల ఆర్థికమూలాలను జగన్ దెబ్బతీయడం ప్రారంభించారు.
బాబు వ్యూహంతో….
గ్రామస్థాయిలో ఉపాధి హామీ పనుల బిల్లులను నిలిపివేశారు. ఇక ముఖ్యనేతల వ్యాపారాలపై దాడులు జరిగాయి. దీంతో చంద్రబాబు కు బెంగపట్టుకుంది. ప్రతి అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రతి విషయాన్ని రచ్చ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం వేరు. ఇసుకమీద చంద్రబాబు చేసిన ఉద్యమాన్ని ప్రజలు కూడా హర్షించారు. కానీ సంక్షేమ పథకాల విషయంలో అమలు కాకుండా జాప్యం చేయించడం, అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తుండటం జగన్ కు ఇబ్బందిగా మారింది.
వ్యవస్థలను అడ్డం పెట్టుకుని….
ఇక నిజమున్నా లేకపోయినా ఆరోపణలు చేయడం, న్యాయస్థానాలను ఆశ్రయించడం టీడీపీకి పరిపాటిగా మారింది. కరోనాతో దాదాపు ఏడాదిన్నర జగన్ పాలనలో ముందడుగు వేయలేకపోయారు. దీంతో పాటు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుండటం కూడా జగన్ అడుగు ముందుకు పడటం లేదు. మొత్తం మీద ఏపీి కి సోలో ముఖ్యమంత్రి తానేనని చంద్రబాబు భావించడం, జగన్ ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడంలో చంద్రబాబు యాభై శాతం సక్సెస్ అయినట్లే కనపడుతుంది. మరి జగన్ చివరకు ఈ ముద్ర నుంచి ఎలా బయటపడతారో చూడాలి.