Ys jagan : ఒక్క ఛాన్స్ ఒక్కసారికేనా?

ఎవరనుకున్నా కాదన్నా చంద్రబాబు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అది ప్రచారమో, నిజమో తెలియదు కాని చంద్రబాబుకు మాత్రం పనిమంతుడిగా పేరు వచ్చింది. రోజుకు 18 గంటలు [more]

;

Update: 2021-11-07 08:00 GMT

ఎవరనుకున్నా కాదన్నా చంద్రబాబు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అది ప్రచారమో, నిజమో తెలియదు కాని చంద్రబాబుకు మాత్రం పనిమంతుడిగా పేరు వచ్చింది. రోజుకు 18 గంటలు పనిచేస్తానని ఆయనే స్వయంగా చెప్పుకునే వారు. కానీ అలాంటి చంద్రబాబును నీ పనితనం మాకు అవసరం లేదని పక్కన పెట్టారు. 23 సీట్లకే పరిమితం చేశారు. ఆయన తర్వాత వచ్చిన జగన్ కు పనిమంతుడిగా పేరు తెచ్చుకోలేదు. జగన్ కంఫర్ట్ గానే తన పని తాను చేసుకుపోతున్నారు.

హడావిడి లేకపోతే?

సమీక్షల హడావిడి ఉండదు. ఆకస్మిక తనిఖీలు లేవు. పోలవరం ప్రతి వారం పోవడం లేదు. కేవలం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమిత మయ్యారు. జగన్ పనిచేస్తున్నట్లు కూడా కన్పించదు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే సమయంలోనే ఆయన అధికారులతో కలిసి కనిపిస్తారు. మరి అలాంటి జగన్ ను ఈసారి ప్రజలు నమ్ముతారా? అన్న సందేహం కూడా వైసీపీ నేతల్లో లేకపోలేదు.

అవే గెలిపిస్తాయా?

కేవలం సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని జగన్ నమ్ముతున్నారు. మాట మీద నిలబడే నేతగా తాను జనంలో విశ్వసనీయతను పొందానని జగన్ భావిస్తున్నారు. తాను తిరిగి రాకుంటే ఈ పథకాలన్నీ నిలిచిపోతాయన్న ఆందోళన ప్రజల్లో ఉంటుందని, అందువల్ల తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న ధీమా జగన్ ప్రతి అడుగులోనూ కన్పిస్తుంది. అన్ని చోట్లా డబ్బు పని చేయదు. అన్ని ఎన్నికల్లో విశ్వాసం ఓట్లను తెచ్చిపెట్టదు.

ప్రచారం ఎక్కడ?

అందుకే జగన్ కేవలం పనిచేసుకుంటూ పోతే సరిపోదు. కష్టపడినట్లు నటించాలి. అందుకు తగిన ప్రచారం కూడా కావాలి. ఏమీ చేయకపోయినా హడావిడి పాలనలో కన్పించాలి. చంద్రబాబుకు పేరు ఉన్నట్లు ఏదో ఒక దానిలో ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకోవాలి. అలా కాకుండా క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే చాలు గెలుస్తామని అనుకుంటే బొమ్మ తిరగబడే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇప్పుడు జగన్ కు కావాల్సింది ప్రచారం. తాను చేసింది జనాలకు తెలియజెప్పడం. ఆ దిశగా జగన్ ప్రయత్నం చేయకపోతే ఒక్క ఛాన్స్ ఒక్కసారికే మిగిలిపోతుంది.

Tags:    

Similar News