Ys jagan : ఆ మంత్రి పదవి అంటే భయపడిపోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని మార్చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమైన శాఖలకు సమర్థులను అప్పగించాలని చూస్తున్నారు. అయితే కొత్త [more]

;

Update: 2021-10-31 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని మార్చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమైన శాఖలకు సమర్థులను అప్పగించాలని చూస్తున్నారు. అయితే కొత్త మంత్రివర్గంలో ఒక శాఖను తీసుకునేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఆ శాఖ తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయం వైసీపీ నేతల్లో కనపడుతుంది. వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతుంది.

పాదయాత్ర సమయంలో….

జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇచ్చారు. వాటిలో 90 శాతం హామీలను అమలు చేయగలిగారు. కానీ ఒక్క హామీ విషయంలో మాత్రం జగన్ వెనక్కు తగ్గారనే చెప్పాలి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఆ దిశగా ముందడుగు వేయలేదు. మద్యం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తేవడం మినహా మరో పని చేయలేదు.

నాసిరకం మద్యం బ్రాండ్లను…

దీనికి తోడు రాష్ట్రంలో నాసికరం మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నారు. పేరు తెలియని బ్రాండ్లను విక్రయిస్తుండటంతో అసహనం వ్యక్తమవుతోంది. మద్యం రేట్లను కూడా విపరీతంగా పెంచారు. ఇది జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వివిధ సంక్షేమ పథకాల కింత ఇస్తున్న నగదు కూడా మద్యానికే సమర్పించుకోవాల్సి వస్తుందని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎవరిని నియమిస్తారు?

ఈ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎవరిని జగన్ నియమిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నారాయణస్వామి ఈ బాధ్యతలను చూస్తున్నారు. ఆయన ను తప్పించడం ఖాయం. ఈయన స్థానంలో ఎవరిని నియమించినా ఆయనపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ఆ పదవి అంటేనే భయపడిపోతున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కాలని కోరుకుంటున్నా, మనసులో మాత్రం ఆ శాఖ వద్దని కోరుకుంటున్నారు. ఈ శాఖ ఇప్పడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News