Ys jagan : ఢిల్లీ టూర్… అదే జరిగితే జగన్ తలాక్ చెప్పేసినట్లే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పరిణామాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. బీజేపీ నేతల నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే దీనిపై కొందరు [more]

;

Update: 2021-10-24 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పరిణామాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. బీజేపీ నేతల నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే దీనిపై కొందరు సీనియర్లతో జగన్ చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలో పరిణామాల తర్వాత జగన్ తన నిర్ణయాన్ని తీసుకునే అవకాశముంది. అవసరమైతే బీజేపీతో దూరం జరగడానికి కూడా జగన్ సిద్ధమయినట్లు సమాచారం. తనను ిఅన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు కు ఎలాంటి అవకాశం లభించినా జగన్ డెసిషన్ వేరేలా ఉంటుందంటున్నారు.

రెండు రోజుల పాటు….

చంద్రబాబు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయనకు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించింది. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ వరకు ఓకే. రఘురామ కృష్ణరాజు కూడా రాష్ట్రపతిని కలిశారు. అయితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దిరిలో ఏ ఒక్కరి అపాయింట్ మెంట్ చంద్రబాబుకు లభించినా జగన్ బీజేపీ పట్ల తన ఆలోచనను మార్చుకునే అవకాశముంది.

అన్నింటా మద్దతిస్తూ…

ఇప్పటికే బీజేపీతో నేరుగా సంబంధాలు లేకపోయినా పరోక్షంగా జగన్ మద్దతిస్తున్నారు. ఇది రాష్ట్రంలో కూడా ఇబ్బందికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయవేటీకరించడం వంటి అంశాలు జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేవే. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిని దృష్టిలో పెట్టుకుని జగన్ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ తన ప్రత్యర్థి చంద్రబాబుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఆహ్వానం పలికితే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుందంటున్నారు.

భవిష్యత్ లో….

వాస్తవానికి జగన్ కు బీజేపీ అవసరం కన్నా, భవిష‌్యత్ లో బీజేపీకే జగన్ అవసరం ఉంటుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం సీట్లు తగ్గినా జగన్ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే జగన్ ఢిల్లీ పెద్దల నిర్ణయానికే వదిలి పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొందరు వైసీపీ నేతలు బీజేపీ పెద్దలకు చేరవేశారని సమాచారం. రెండు రోజుల చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News