Ys jagan : “రెడ్ల” కు ఈసారి కూడా మొండిచేయేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తుండటంతో [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తుండటంతో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తుండటంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణను చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇదే ఎన్నికల కేబినెట్ కానుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఎవరికి మంత్రి పదవులు వస్తాయన్న దానిపై జోరుగా పార్టీలో చర్చ జరుగుతోంది.
టోటల్ ఛేంజ్….
మంత్రి వర్గ విస్తరణ గ్యారంటీ. ముహూర్తం ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే జగన్ మంత్రి వర్గ విస్తరణను చేయనున్నారు. ఈసారి పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించారు. టోటల్ గా ఛేంజ్ చేసి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. పార్టీ సీనియర్లతో పాటు సామాజికవర్గాలను ప్రాతిపదికగా చేసుకుని జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయి.
సజ్జల వద్దకు క్యూ….
మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. జగన్ ను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో తమకు ఉన్న అర్హతలతో పాటు పార్టీకి చేసిన సేవలను కూడా వారు సజ్జల ముందు ఉంచుతున్నారు. సజ్జల ద్వారా తమ మనసులో మాటను జగన్ కు తెలియజేయాలన్నది వారి ప్రయత్నం. ఇది తమకు చివరి ఛాన్స్ అని కొందరు సీనియర్లు మొరపెట్టుకుంటున్నారు.
రెడ్డి సామాజికవర్గానికి…..
ఈ నేపథ్యంలో జగన్ ఎవరికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ కేబినెట్ లోనూ రెడ్డి సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యత దక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో నలుగురు మాత్రమే రెడ్లు ఉన్నారు. అదే సంఖ్యను కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. ఎన్నికలు ఉండటంతో మరోసారి అధికారంలోకి రాగానే ఇప్పుడు ఇవ్వలేకపోయిన రెడ్డి నేతలకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ఆశావహులు ఈ సామాజికవర్గం వారే కావడంతో జగన్ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద ఏపీ వైసీీపీలో మంత్రి వర్గ విస్తరణ ఫీవర్ పట్టుకుంది.