Ys jagan : వారికి మంత్రి పదవులు.. అందుకే అక్కడకు పంపారా?
బద్వేలు ఉప ఎన్నిక వైసీపీలో ఒక వాస్తవాన్ని బయటపెట్టింది. జగన్ తాను నమ్ముతున్న వాళ్లు ఎవరో చెప్పకనే చెప్పారు. బద్వేలు ఉండేది కడప జిల్లాలో. పక్కనే అనంతపురం, [more]
;
బద్వేలు ఉప ఎన్నిక వైసీపీలో ఒక వాస్తవాన్ని బయటపెట్టింది. జగన్ తాను నమ్ముతున్న వాళ్లు ఎవరో చెప్పకనే చెప్పారు. బద్వేలు ఉండేది కడప జిల్లాలో. పక్కనే అనంతపురం, [more]
బద్వేలు ఉప ఎన్నిక వైసీపీలో ఒక వాస్తవాన్ని బయటపెట్టింది. జగన్ తాను నమ్ముతున్న వాళ్లు ఎవరో చెప్పకనే చెప్పారు. బద్వేలు ఉండేది కడప జిల్లాలో. పక్కనే అనంతపురం, కర్నూలు జిల్లాలున్నాయి. కడప జిల్లాకు చాలా దగ్గరలో ఉండే ఈ జిల్లాలు కాదని బద్వేలు ఉప ఎన్నికకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలను తీసుకు రావడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. జగన్ వారిని బలంగా నమ్ముతున్నందునే అక్కడ ఇన్ ఛార్జులుగా నియమించారని అంటున్నారు.
కడప, కర్నూలు జిల్లాలో…..
కడప జిల్లాలో వైసీపీకి పదిమంది ఎమ్మెల్యేలున్నారు. కర్నూలు జిల్లాలో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నలుగురు మంత్రులున్నారు. వారిలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు) శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి) రఘురామరెడ్డి (మైదుకూరు) సుధీర్ రెడ్డి (జమ్మలమడుగు) లను మాత్రమే నియమించారు. పొరుగున ఉన్న అనంతపురం జిల్లా నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (రాప్తాడు)కు మాత్రమే అవకాశం కల్పించారు. పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా నుంచి ఎవరిని జగన్ ఇన్ ఛార్జిగా నియమించలేదు.
దూరపు ప్రాంతాల నుంచి…
ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవర్ ఆల్ ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. ఆయనను పక్కన పెడితే అదే జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డిని ఇన్ ఛార్జులుగా నియమించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ పెద్దగా లేకపోయినా నమ్మకమైన నేతలను, తనకు ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చే వారినే జగన్ నియమించుకున్నారన్న టాక్ పార్టీలో జోరుగా నడుస్తుంది.
కేబినెట్ విస్తరణలో….
ఈ ఇన్ ఛార్జుల నియామకానికి, మంత్రి వర్గ విస్తరణకు కూడా ముడిపెడుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి వచ్చే మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో బద్వేలు ఉప ఎన్నికలో ఇన్ ఛార్జులు ఎక్కువ మందికి చోటు ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జగన్ మాత్రం తనకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వారిని, ఇతర పనులు వదిలేసి చెప్పిన పనిని తూచ తప్పకుండా చేసేవారిని ఎంచుకున్నారని, దీనికి మంత్రి వర్గవిస్తరణకు సంబంధం లేదని కూడా చెబుతున్నారు. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నికకు, మంత్రి పదవులకు సంబంధం ఉందా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది.