Ys jagan : ఆ నేతలపై జగన్ అసహనం… కారణమిదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నియోజకవర్గాల నేతలో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. వీరితో మాట్లాడి [more]

Update: 2021-11-07 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నియోజకవర్గాల నేతలో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. వీరితో మాట్లాడి అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 24 స్థానాల్లో విజయం లభించలేదు. వీటిలో 23 నియోజకవర్గాల్లో టీడీపీ, ఒక దానిలో జనసేన గెలిచింది.

24 నియోజకవర్గాల్లో….

ఈ 24 నియోజకవర్గాల్లో ఐదుగురు వైసీీపీకి మద్దతుదారులుగా మారిపోయారు. అయినా సరే అక్కడి పరిస్థితులు ఏమీ బాగా లేవు. ఐదు నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలు సహకరించడం లేదు. దీంతో పాటు మిగిలిన 19 నియోజకవర్గాల్లో కొన్ని ప్యాచ్ అప్ లు చేసినా అక్కడ వైసీపీ పుంజుకోలేదని సమాచారం రావడంతో ఈ 24 నియోజకవర్గాల పార్టీ నేతలో విడివిడిగా సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఐదు చోట్ల…..

గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరి కి పోటీగా మరొక వర్గం సహకరించడం లేదు. అలాగే చీరాలలో ఆమంచి, కరణం వర్గీయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గన్నవరంలోనూ వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. రాజోలులో మూడు వర్గాలు తయారయ్యాయి. విశాఖపట్నం సౌత్ లోనూ అంతే పరిస్థితి. ఇలా పార్టీకి మద్దతుదారులుగా నిలిచిన చోట కూడా వైసీీపీ బలంగా లేదని గుర్తించారు.

ఎమ్మెల్సీ పదవులిచ్చినా…

అదే సమయంలో హిందూపురం లాంటి చోట్ల వైసీపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అలాగే టెక్కలిలోనూ అదే ప్రయోగం చేశారు. మండపేట వంటి చోట ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి ఇన్ ఛార్జిగా నియమించారు. మూడు చోట్ల ముగ్గురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ప్రయోజనం లేదని నివేదికలు అందుతున్నాయి. ఒక్క మండపేటలో మాత్రం కొంత బలం చేకూరింది. అయినా కొన్ని చోట్ల వైసీపీ బలోపేతం కాకపోవడంపై జగన్ అసహనంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వారితో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జగన్ సిద్దమయ్యారని టాక్.

Tags:    

Similar News