Ys jagan : ఒంటరిని చేస్తున్నారా….? సక్సెస్ అయినట్టే ఉంది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లో ఆరితేరారు. ఎక్కడ నొక్కాలో తెలుసుకుని మరీ అక్కడ నొక్కుతున్నారు. అధికారంలో ఉండటంతో జగన్ కు మరింత అడ్వాంటేజీగా మారుతుంది. జగన్ కు [more]

;

Update: 2021-10-29 05:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లో ఆరితేరారు. ఎక్కడ నొక్కాలో తెలుసుకుని మరీ అక్కడ నొక్కుతున్నారు. అధికారంలో ఉండటంతో జగన్ కు మరింత అడ్వాంటేజీగా మారుతుంది. జగన్ కు పవన్ కల్యాణ్ ఆగర్భ శత్రువు. జనసేన పార్టీ 2014లో పెట్టిన నాటి నుంచి పవన్ కల్యాణ్ జగన్ ను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎప్పటికీ కాలేరని కూడా పవన్ కల్యాణ‌్ శాపనార్థాలు పెట్టారు. అలాంటి పవన్ కల్యాణ్ ను అన్ని రకాలుగా ఒంటరి చేసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.

కాపుల అంశంలో….

పవన్ కల్యాణ్ ను టీడీపీ మిత్రుడని గత ఎన్నికల నుంచే జగన్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. చంద్రబాబుకు మరోసారి అధికారం ఇవ్వడానికే పవన్ ప్రయత్నాలంటూ చేసిన ప్రచారం పోయిన ఎన్నికల్లో వర్క్ అవుట్ అయింది. కాపులు సయితం వైసీపీకి గత ఎన్నికల్లో అండగా నిలిచారు. ఇప్పుడు మరోసారి కాపులను ఏకం చేసే పవన్ కల్యాణ్ ప్రయత్నాలకు జగన్ చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ముద్రగడను దగ్గరకు తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి….

ఇక ఎన్నికల వేళ టాలీవుడ్ నుంచి కూడా తనకు మద్దతు కావాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టాలీవుడ్ నుంచి జగన్ కు మద్దతు లభించలేదు. తొలి నుంచి టాలీవుడ్ టీడీపీకి అనుకూలంగా ఉండటమే దీనికి కారణం. అయితే ఈసారి టాలీవుడ్ లోనూ పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు జగన్ ప్రారంభించినట్లే కనపడుతుంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం స్టార్లను జగన్ దగ్గర తీస్తున్నారు. నాగార్జునతో జగన్ భేటీ ఈ కోణంలో చూడాల్సిందే.

పవన్ కు ఝలక్…..?

సినిమా టిక్కెట్ల ధరలను ఆన్ లైన్ లో ఉంచడంపై పవన్ కల్యాణ‌్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అదే టాలీవుడ్ నుంచి నిర్మాతల నుంచి నటుల వరకూ మద్దతును జగన్ పొందగలిగారు. పవన్ ను టాలీవుడ్ లోనూ ఒంటరి చేశారన్నది టాక్. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన నాగార్జునతో భేటీ అయి పవన్ కల్యాణ్ కు సంకేతాలను జగన్ బలంగా పంపారు. నిజానికి నాగార్జున తాను వచ్చింది జగన్ ను వ్యక్తిగతంగా కలవడానికేనని, జగన్ ను చూసి చాలా రోజులయిందని, తాను జగన్ శ్రేయోభిలాషినని నాగార్జున చెప్పడం టాలీవుడ్ లోనూ పవన్ కు చెక్ పెట్టడానికేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News