Ys jagan : మరింత టైం తీసుకుంటారటగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారా? లేదా? అసలు ఆ ఆలోచన ఉందా? ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి ముప్ఫయి నెలలు దాటుతోంది. రెండున్నరేళ్లకే [more]

Update: 2021-11-07 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారా? లేదా? అసలు ఆ ఆలోచన ఉందా? ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి ముప్ఫయి నెలలు దాటుతోంది. రెండున్నరేళ్లకే మంత్రివర్గ విస్తరణ చేపడతామన్న జగన్ ఇంతవరకూ విస్తరణ చేపట్టకపోవడానికి కారణాలేంటి? అనే చర్చ పార్టీలో జరుగుతుంది. నిజానికి జగన్ చెప్పినట్లుగా జరిగితే మొన్న ఆగస్టు నెలకే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మంత్రులు తమ పదవిని పూర్తికాలం అనుభవించలేకపోయారన్న ఉద్దేశ్యంతో మరో ఆరు నెలలు మంత్రి వర్గ విస్తరణ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి.

అన్ని పదవులు….

అయితే వచ్చే ఏడాది మొదట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు. ఎన్నికలకు అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ లోపు పదవులు భర్తీ కూడా పూర్తవుతుంది. ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆ పదవుల భర్తీతో కొంత అసంతృప్తిని తొలగించే అవకాశముంది. మొత్తం 14 ఎమ్మెల్సీ పోస్టులు త్వరలోనే భర్తీ కానున్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందంటున్నారు.

వచ్చే ఏడాది….

అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చి నెల తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. కరోనా దృష్ట్యా ఇప్పటి వరకూ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలుంటాయని కొందరు పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

అంత సులువుగా లేదు….

మరోవైపు ఈసారి మంత్రి వర్గ విస్తరణ కూర్పు కూడా అంత సులువుగా లేదు. ఆశావహులు చాలా మంది ఉన్నారు. కీలక నేతలే తమకు మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల కేబినెట్ కావడంతో కొంత ఆచితూచి జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే మంత్రి వర్గ విస్తరణకు మరికొంత సమయం ఉంటేనే బెటర్ అని జగన్ భావిస్తున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న దానిని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకూ మంత్రి వర్గ విస్తరణ ఉండబోదని తెలుస్తోంది.

Tags:    

Similar News