Ys jagan : ఎమ్మెల్యేలపై ఆంక్షలు.. తెలిస్తే షాకవుతారు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్న పార్టీలూ వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లే కన్పిస్తుంది. ఆ [more]

Update: 2021-11-08 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్న పార్టీలూ వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లే కన్పిస్తుంది. ఆ మధ్య మంత్రివర్గ సమావేశంలో జగన్ చెప్పిినట్లుగానే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. అదే సమావేశంలో నవంబరు నుంచి ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఎమ్మెల్యేలందరికీ ఆదేశాలు జారీ చేశారు.

బయటకు వెళితే….?

ినియోజకవర్గాన్ని వీడి ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. కేవలం వీకెండ్, సెలవుల సమయంలో మాత్రమే నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లాలని, రెండు రోజులకు మించి నియోజకవర్గాన్ని వదలి వెళుతుంటే కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలా సమాచారం వెళ్లకుండా నియోజకవర్గం వదలి వెళ్లిన వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.

గ్రామాల పర్యటనలకు….

ఎన్నికలకు ఇంకా సమయం చాలా ఉన్నా ఈ మూడేళ్లు కీలకంగా జగన్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై ఎక్కువ వ్యతిరేకత కన్పిస్తుండటంతో వారంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను గుర్తించి ఫొటోలతో సహా కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అక్కడ ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు కూడా కృషి చేయాలని చెప్పినట్లు సమాచారం.

పీకే టీం కు సహకారం…

మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీం కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. వారికి కూడా సహకారం అందించాలని కూడా ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. వారికి కావాల్సిన వసతి, వాహన సదుపాయాలను సమకూర్చాలని ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయం నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో ఎమ్మెల్యేలు ఇక నియోజకవర్గాల నుంచి పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వ్యాపారాలు, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలకు జగన్ ఈ విధంగా ఝలక్ ఇచ్చారని తెలిసింది.

Tags:    

Similar News