Ys jagan : జగన్ డెసిషన్ ఫైనల్… ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు వీరేనట
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురు అధికార వైసీీపీ నుంచి ఎన్నికవుతారు. ఈ ఏడాది [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురు అధికార వైసీీపీ నుంచి ఎన్నికవుతారు. ఈ ఏడాది [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురు అధికార వైసీీపీ నుంచి ఎన్నికవుతారు. ఈ ఏడాది మే నెల 31వ తేదీతో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి, టీడీపీకి చెందిన షరీఫ్ పదవీ కాలం పూర్తయింది. ఈ మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే జగన్ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయనున్నారన్న చర్చ జరుగుతోంది.
ఆయనకు రెన్యువల్….
గోవిందరెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. బద్వేలు ఉప ఎన్నిక పూర్తికావడంతో ఆయనను మరోసారి జగన్ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక సోము వీర్రాజు, షరీఫ్ స్థానాల్లో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే మైనారిటీ కోటా కింద ఇద్దరికి అవకాశం కల్పించడంతో ఈసారి మైనారిటీలకు అవకాశం లేనట్లే కన్పిస్తుంది. జిల్లాల సమీకరణాలను కూడా జగన్ మార్చనున్నారు.
ఈసారి జిల్లాల మార్పు…
నిజానికి ఆ రెండు స్థానాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవి. కానీ ఈసారి అదే జిల్లాలతో ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేసే అవకాశం కన్పించడం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇటీవలే ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, మోషేన్ రాజులను జగన్ ఎంపిక చేశారు. సో.. ఈసారి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పదవులను ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. విశాఖ, గుంటూరు జిల్లాల నుంచి భర్తీ చేయనున్నారు.
గుంటూరు, విశాఖ జిల్లాల నుంచి….
గోవిందరెడ్డి పేరు దాదాపు ఖరారయినట్లే. ఆయన సీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ కు అవకావశం కల్పిస్తారంటున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు జగన్ ఎప్పుడో హామీ ఇచ్చినా ఇంతవరకూ పదవి ఇవ్వలేదు. ఈసారి ఆయనకు గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక విశాఖ నుంచి వంశీకృష‌్ణ శ్రీనివాస్ కు అవకాశముంటుందని చెబుతున్నారు. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అది జగన్ పరిగణనలోకి తీసుకుంటే దాడి వీరభద్రరావుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముగ్గురు మూడు సామాజికవర్గాలకు చెందిన వారు కావడంతో ఈ ముగ్గురి ఎంపిక ఫైనల్ అయిందన్న ప్రచారం జరుగుతుంది.