జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే

చంద్రబాబు కలల రాజధాని అమరావతి కదులుతోందా. ఏపీ ప్రజలకు నూతన రాజధానిగా దొనకొండ ఏర్పాటు అవుతుందా. అసలింతకీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముంది. ఇపుడు ఇదే విషయం [more]

;

Update: 2019-07-10 11:00 GMT

చంద్రబాబు కలల రాజధాని అమరావతి కదులుతోందా. ఏపీ ప్రజలకు నూతన రాజధానిగా దొనకొండ ఏర్పాటు అవుతుందా. అసలింతకీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముంది. ఇపుడు ఇదే విషయం చర్చకు వస్తోంది. జగన్ అయిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా అమరావతి విషయంలో పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. టీడీపీ అమరావతి పేరు చెబితే ఆయన సరేననేసి అసెంబ్లీలో ఊరుకున్నారు. ఇక రాజధాని ప్రారంభానికి కూడా రాలేదు. ఇక అమరావతి పేరు మీద చంద్రబాబు ఎన్ని రకాల విన్యాసాలు చేయాలో చేశారు, కానీ అక్కడ శాశ్వతమైన కట్టడం ఒక్కటి కూడా కట్టలేకపోయారు. అయిదేళ్ల పాలన అలా ముగించేశారు. ఇదే ఇపుడు జగన్ కి కలసివస్తోంది. అమరావతి అభివృధ్ధి కాకపోవడంతో ఇపుడు రాజధాని స్వరూపం మార్చేందుకు జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు.

గ్రేటర్ రాయలసీమ కోసమా….

జగన్ కి తాజా ఎన్నికల్లో రాయలసీమ మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు గాను మూడు తప్ప అన్నీ దక్కాయి. ఎంపీలైతే మొత్తానికి మొత్తం వైసీపీకే ఓటెత్తాయి. ఇక ప్రకాశం, నెల్లూరు కూడా వైసీపీకి తొంబయి శాతం సీట్లు, ఓట్లు ఇచ్చి ఆదుకున్నాయి. 75 అసెంబ్లీ సీట్లు ఉండే గ్రేటర్ రాయలసీమకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. నిజానికి అమరావతి రాజధాని అంటే రాయలసీమ వాసులకు పెద్దగా ఇష్టం లేదన్న మాట మొదటి నుంచి ఉంది. మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయాక తొలి రాజధాని కర్నూల్ అయింది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక కూడా రాజధాని తమ ప్రాంతానికే రావాలన్నది రాయలసీమ వాసుల పట్టు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పట్లో సీన్ మారింది. అయిదేళ్ళు తిరగకుండా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చేసారు కాబట్టి ఇపుడు మళ్ళీ సీమ వాసుల్లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సైతం సై అనేలా వ్యూహ రచన చేస్తున్నారు.

అన్ని విధాలుగా లాభమేనా…?

అమరావతి రాజధాని అంటే అంత క్షేమకరం కాదని శివరామకృష్ణ కమిషన్ ఎపుడో చెప్పింది. పైగా భూకంపాల జోన్లో రాజధాని వద్దని చెప్పింది. ఇక ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండే చోట రాజధాని ఏర్పాటు చేస్తే బాగుటుందని, ఖర్చు కూడా ఉండదని కూడా చెప్పుకొచ్చింది. నూజివీడు తో పాటు దొనకొండను కూడా శివరామ‌క్రిష్ణ కమిషన్ సిఫార్సు చేసింది, ఇక్కడ అటవీ భూములు ఎక్కువగా ఉండడమే కారణం. ఇపుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అదే పని చేయబోతున్నారని అంటున్నారు. కేంద్రం సాయం అంతంత మాత్రంగా ఉన్న నేపధ్యంలో ఉన్నంతలో శాశ్వతమైన రాజధాని, అక్కడే కట్టుదిట్టమైన భవనాలు కట్టి చూపించాలని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అవుతున్నారు. ఇక అమరావతి భూములనీ రైతులవి, అక్కడ పంటలు పండే పరిస్థితి ఉంది. దాంతో వారికే ఇచ్చేస్తారని అంటున్నారు. కాని అది సాధ్యం కాదంటున్నారు. రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సచివాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించి మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలన్నది వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెబుతన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News