మిడిల్ క్లాస్ కు బాస్ గా

ఆరోగ్యశ్రీ పేదవారికి సంజీవని వంటిది. నిరుపేద కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా అత్యాధునిక కార్పొరేట్ వైద్యం పొందేందుకు [more]

Update: 2019-07-12 11:30 GMT

ఆరోగ్యశ్రీ పేదవారికి సంజీవని వంటిది. నిరుపేద కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా అత్యాధునిక కార్పొరేట్ వైద్యం పొందేందుకు ఆరోగ్యశ్రీ రక్షణ కల్పిస్తుంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిన ఆరోగ్యశ్రీ దేశవ్యాప్తంగా ఆదర్శం అయ్యింది. పేదల గుండెలలో ఆయనను కొలువు తీరేలా చేసింది. లక్షలాదిమంది ప్రాణాలను కాపాడింది. ఆ స్కీం కి సరికొత్త మెరుగులు పెట్టి మరిన్ని వర్గాలకు విస్తరించేలా చేసింది జగన్ సర్కార్.

ఐదు లక్షల ఆదాయపరిమితి లోపు ఉంటే …

వైసిపి తమ తొలి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా విద్యా, వైద్యంపై వైఎస్ ఆశయాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల ఆదాయ పరిమితి లోపు వుండే అందరికి వర్తింప చేయడానికి ముఖ్యమంత్రి సంకల్పించారు. ఈ మేరకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దీనికి భారీ నిధులను సైతం కేటాయించింది సర్కార్. పాదయాత్రలో జగన్ పేద వర్గాలవారితో పాటు మధ్యతరగతికి ఆరోగ్యశ్రీ ని అమలు చేస్తామని హామీనిచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ బడ్జెట్ లో నిధులు కేటాయించి మధ్యతరగతి వర్గాలపై వరాలు కురిపించారు జగన్.

జగనన్న అమ్మ ఒడి ….

నిజమైన ఆస్తి ప్రతివారికి విద్య మాత్రమే అని వైసిపి సర్కార్ తన వాగ్ధానాల్లో ప్రధానమైన అమ్మఒడి పథకాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించింది. స్కూల్ కి తమ పిల్లలను పంపే తల్లులకు ఏడాదికి 15 వేలరూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ అయ్యేలా ప్రభుత్వం ఈ పథకం కింద సాయం అందిస్తుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఈ పథకాన్ని విస్తరించడం విశేషం. ఇలా విద్యా వైద్యం బాధ్యత ప్రభుత్వమే తీసుకునే చర్యలను చేపట్టిన జగన్ బడ్జెట్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అమ్మఒడి గానే ముందు అనుకున్నా వైఎస్ జగన్ ఆలోచనలో నుంచి వచ్చిన పథకం కావడంతో ఆయనపేరు పెట్టేందుకు మంత్రులు ఎమ్యెల్యేలు వత్తిడి తేవడంతో ఆయన ఎట్టకేలకు అంగీకరించారు అని ఆర్ధికమంత్రి అసెంబ్లీలో స్వయంగా ప్రకటించడం విశేషం. లోటు బడ్జెట్ ఉన్నా కేంద్ర సహకారం అంతంత మాత్రమే అయినా వున్న వనరులతోనే జగన్ సాహసోపేత నిర్ణయాల అమలు ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News