వారికి గేట్లు మూసేశారట
రాజకీయాల్లో నేతల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేకుండా ఉన్నాం.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. చాలా ఆసక్తిగా మారుతున్నారు. 2014లో [more]
రాజకీయాల్లో నేతల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేకుండా ఉన్నాం.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. చాలా ఆసక్తిగా మారుతున్నారు. 2014లో [more]
రాజకీయాల్లో నేతల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేకుండా ఉన్నాం.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. చాలా ఆసక్తిగా మారుతున్నారు. 2014లో ఉన్న పరిస్థితి 2017లో మారిపోయింది. 2014 ఎన్నికల్లో అనేక మంది కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీలో చేరి టికెట్‌లు సంపాయించుకుని జగన్ హవాతో విజయం సాధించారు. అయితే, తర్వాత కాలంలో అప్పటి ప్రభుత్వాధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్‌తో ఆయన బుట్టలో పడి మంత్రి పదవులు పొందిన వారు కొందరైతే.. కాంట్రాక్టులు తీసుకున్నవారు మరికొందరు. ఇంకొందరు పార్టీ మారేందుకు డబ్బులు తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.
వేడెక్కిన రాజకీయం….
ఇలా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేసి చంద్రబాబు చెంతకు చేరిపోయారు. వీరిలో చాలా మంది ఇటీవల ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసినా.. ఓటమి బాటపట్టారు. అయితే, ఇప్పుడు టీడీపికి ఇక రాష్ట్రంలో భవితవ్యం లేదనిభావిస్తున్న వారు. తమపై నమోదైన కేసులతో అల్లాడుతున్నవారు.. చాలా మంది తిరిగి వైసీపీ గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఈ రెండు కాకపోయినా.. నియోజకవర్గంలో తమ హవా సాగించుకోవాలని చూస్తున్నవారు కూడా టీడీపీకి బై చెప్పి.. తప్పు చేశామని ఒప్పుకుని మరీ వైసీపీ జెండాకప్పుకోవాలని చూస్తున్నారు. దీంతో మరోసారి రాజకీయం వేడెక్కింది.
ముఖ్యనేతలందరూ….
ఇలా జంప్ చేయాలని చూస్తున్న వారిలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి వంటివారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ఇటీవల రెండు రోజుల కిందట టీడీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అన్నా క్యాంటీన్ల ఆందోళనకు కూడా డుమ్మా కొట్టారు. వీరంతా నియోజకవర్గాల్లోనే ఉన్నా కూడా.. సాక్షాత్తూ .. పార్టీ అధినేత చంద్రబాబే పిలుపు ఇచ్చినా.. పట్టించుకోక పోవడాన్ని బట్టి ఇక, తమకు టీడీపీకి సంబంధం లేదనే సంకేతాలను పంపేశారు.
వైసీపీలో చేరాలని ఉన్నా…..
వైసీపీ నుంచి గెలిచిన టీడీపీలో మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి ఓడిపోయాక అస్సలు నియోజకవర్గాన్నే పట్టించుకోవడం లేదట. గిడ్డి ఈశ్వరి కూడా జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఆమెను కూడా వైసీపీ నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. తమను కాదని వెళ్లిన వారికి పార్టీలో స్థానం ఎలా ఇస్తామని నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ సహా ఆయన సలహాదారు, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇలానే వ్యాఖ్యానిస్తుండడంతో ఈ నేతలకు ఇక, వైసీపీలో ఎంట్రీ లేనట్టేనని అంటున్నారు పరిశీలకులు. కీలకు నేతల ఎంట్రీకి గేట్లు క్లోజ్ చేసేసిన జగన్ టీడీపీ నుంచి వచ్చే ద్వితీయ శ్రేణి నేతల విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదట.