ఫెయిలయ్యారని పక్కన పెట్టారా…?

వైఎస్ జగన్ ను నమ్ముకుని ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు ఏ పదవి ఇంతవరకూ దక్కని వారిలో కొందరున్నారు. వారిలో ఇప్పుడిప్పుడే అసంతృప్తి బయలుదేరుతుంది. వైఎస్ జగన్ [more]

Update: 2019-08-18 12:30 GMT

వైఎస్ జగన్ ను నమ్ముకుని ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు ఏ పదవి ఇంతవరకూ దక్కని వారిలో కొందరున్నారు. వారిలో ఇప్పుడిప్పుడే అసంతృప్తి బయలుదేరుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తనన చూస్తారన్న నమ్మకం ఆ నేతలకు ఉండేది. కానీ వైఎస్ జగన్ పట్టించుకోక పోవడంతో అసహనానికి గురవుతున్నారు. వారిో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఒకరు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి వైసీపీకి, వైఎస్ జగన్ కు విశ్వసనీయమైన నేత.

రెండుసార్లు గెలిచి….

2009 ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైఎస్ మరణం, వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టడంతో ఆయన వెంట నడిచారు. రాజంపేటలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి గెలుపొందారు. జగన్ పార్టీలోనే కొనసాగారు. అయితే 2014 ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను జగన్ రాజంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించారు.

జగన్ నే నమ్ముకున్నా…..

2019 ఎన్నికలకు వచ్చే సరికి రాజంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు గత ఎన్నికలలో జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి అధికారంలోకి రాగానే మంచి పదవి ఇస్తానని చెప్పారు. దీంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మేడా విజయానికి కృషి చేశారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తిరుపతి వెంకన్న భక్తుడు. ఆయన ఏడాదికొకసారి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వస్తారు.

ఏ పదవీ రాకపోవడంతో….

టీటీడీ ఛైర్మన్ పదవి వస్తుందనుకున్న ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ఆ పదవి తన బంధువు వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఇచ్చేశారు. దీంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందేమోనన్న ఆశలు కూడా ఇటీవల నీరుగారిపోయాయి. సీమ రెడ్డి కోటాలో ఆ పదవి చల్లా రామకృష్ణారెడ్డి ఎగరేసుకుపోయారు. దీంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి జగన్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తన సన్నిహితుల వద్ద ఆకేపాటి చెబుతున్నారు. 2012 ఉప ఎన్నికల్లో ఆకేపాటి ఓడిపోవడంతో ఆయనను జగన్ ఫెయిల్యూర్ లీడర్ గా చూస్తున్నారన్న టాక్ కూడా పార్టీలో విన్పిస్తుంది.

Tags:    

Similar News