Ys Sharmila : జగన్ ను బాగా ఇరిటేట్ చేస్తున్నారా?

వైఎస్ షర్మిల  అన్న జగన్ తో యుద్దానికి కాలుదువ్వితున్నట్లే అనిపిస్తుంది. జగన్ ను ఇరుకున పెట్టేందుకు వైఎస్ షర్మిల అడుగులు భవిష్యత్ లో ఉంటాయని తెలుస్తోంది. జగన్ [more]

;

Update: 2021-09-25 02:00 GMT

వైఎస్ షర్మిల అన్న జగన్ తో యుద్దానికి కాలుదువ్వితున్నట్లే అనిపిస్తుంది. జగన్ ను ఇరుకున పెట్టేందుకు వైఎస్ షర్మిల అడుగులు భవిష్యత్ లో ఉంటాయని తెలుస్తోంది. జగన్ ను నిత్యం విమర్శించే ఒక మీడియా సంస్థలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ విభేదాలను వైఎస్ షర్మిల బయటపెట్టి జగన్ ను బజార్లోకి ఈడ్చే ప్రయత్నాల్లో ఉన్నారన్నది స్పష్టం. ఆ మీడియా సంస్థకు షర్మిల వెళ్లారంటనే జగన్ ను టార్గెట్ చేయడం కోసమేనని చెప్పకతప్పదు. జగన్ ను మరింత ఇరిటేట్ చేయడానికే.

అధికారంలోకి రాగానే…

వైఎస్ జగన్ కు చెల్లెలు షర్మిల అంటే ఇష్టం. షర్మిలమ్మ అని పిలుచుకునే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలకు చోటు లేకుండా చేశారు. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే వైఎస్ షర్మిలకు పదవి లభిస్తుందని ఊహించారు. వైసీపీలో నెంబర్ 2 స్థానం వైఎస్ షర్మిలదే అని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు దూరమయ్యారు.

అన్న వైఖరితోనే…

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం జగన్ వైఖరేనని చెబుతున్నారు. జగన్ తనను పట్టించుకోక పోవడం, తాను చేసిన సిఫార్సులను సయితం జగన్ పరిగణనలోకి తీసుకోకపోవడం ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని అంటున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న కుటుంబ విభేదాలను ఒక టీవీ షోలో బయటపెట్టడాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రానున్న కాలంలో….

వైఎస్ షర్మిలకు తల్లి విజయమ్మ అండగా నిలిచారనిపిస్తోంది. జగన్ అధికారంలోకి రావడానికి వైఎస్ షర్మిల కూడా ఒక కారణమని చెప్పాలి. ఒక మహిళగా మూడువేల కిలోమీటర్ల కు పైగా పాదయాత్ర చేసి వైఎస్ షర్మిల జగన్ కు అండగా నిలిచారు. అలాంటి షర్మిల జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు భవిష్యత్ కార్యాచరణను ముందుగానే ప్లాన్ చేసుకున్నారని దీన్న బ్టి అర్థమవుతుంది. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల మధ్య వైరం రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News