Ys sharmila : ముందుగానే ఖరారట.. అంతా ఏడాదిలోపే
వైెఎస్సార్టీపీ ఛీఫ్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని ఆమె గ్రామ స్థాయిలో పార్టీ నేతల నియామకంపై [more]
;
వైెఎస్సార్టీపీ ఛీఫ్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని ఆమె గ్రామ స్థాయిలో పార్టీ నేతల నియామకంపై [more]
వైెఎస్సార్టీపీ ఛీఫ్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని ఆమె గ్రామ స్థాయిలో పార్టీ నేతల నియామకంపై ఫోకస్ పెంచారు. వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని వైఎస్ షర్మిల ఇప్పటికే స్పష్టం చేశారు. ఒంటరిగానే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆమె ప్రకటించారు.
పాదయాత్రతో….
119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. షర్మిల వచ్చే నెల 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి చేవెళ్లతోనే ముగిస్తారు. ప్రజాప్రస్థానం పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్ర వచ్చే ఏడాది అక్టోబరు నెల వరకూ జరుగుతుంది. మొత్తం 90 నియోజకవర్గాలలో పాదయాత్ర సాగేలా ప్లాన్ చేశారు. పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ను కూడా రూపొందించారు.
రూట్ మ్యాప్ ….
రోజుకు పది నుంచి ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ ను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రూట్ మ్యాప్ కోసం జిల్లాలకు నేతలు వెళ్లారు. పాదయాత్ర సమయంలోనే వైఎస్ షర్మిల కీలక నేతలను కొందరిని కలుసుకుంటారని చెబుతున్నారు. ఈ 90 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులను కూడా పాదయాత్ర పూర్తయ్యేలోగా ఖరారు చేయాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు.
అభ్యర్థుల ఖరారుతో పాటు….
దీంతో పాటు చేరికలు కూడా ఉండాలని వైఎస్ షర్మిల కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తులను పార్టీవైపునకు తిప్పుకోవాలన్నది ఆమె ఆలోచనగా కనపడుతుంది. ఇప్పటికే ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, ఎన్నికలకు ముందు పార్టీలో వారు చేరతారని వైఎస్సీర్టీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద షర్మిల పార్టీ ని గెలుపుదిశగా పయనింప చేేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.