Ys sharmila : హుజూరాబాద్ లో షర్మిల మద్దతు వారికేనా?

వైెఎస్సార్టీపీ చీఫ్ షర్మిల హ‍ుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. తమ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దింపలేదు. అయితే లోపాయికారీగా షర్మిల మద్దతును కూడగట్టడం కోసం [more]

;

Update: 2021-10-22 11:00 GMT

వైెఎస్సార్టీపీ చీఫ్ షర్మిల హ‍ుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. తమ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దింపలేదు. అయితే లోపాయికారీగా షర్మిల మద్దతును కూడగట్టడం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. షర్మిల అక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లే కనపడుతుంది. షర్మిలతో చర్చించారో లేదో తెలియదు కాని ఆమె అడుగులు మాత్రం బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నాయి.

కేసీఆర్ నే…..

వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోలికి పెద్దగా వెళ్లడం లేదు. నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం షర్మిల దీక్షలు చేస్తున్నారు. ఏ సమస్య అయినా వెంటనే స్పందించి అక్కడకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు దిగుతున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం తాము పోటీ చేయడం లేదని షర్మిల ఇదివరకే ప్రకటించారు.

త్వరలో పాదయాత్ర….

సాధారణ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెల 20 నుంచి షర్మిల పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఆమె మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. అక్కడ రెడ్డి సామాజికవర్గం ఓటర్లతో పాటు, దళిత ఓట్లు, వైెఎస్ అభిమానులు కూడా ఉండటంతో ఆమె మద్దతును కోరే యత్నం బీజేపీ చేస్తుంది.

పరోక్ష మద్దతు ఇస్తారా?

అందుకే ఇటీవల ఎన్నికల కమిషనర్ ను కలసి అధికార టీఆర్ఎస్ పై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారంటున్నారు. బీజేపీ పై ఎటువంటి విమర్శలు చేయకపోవడం, టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుండటంతో ఆమె హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పరోక్ష మద్దతిస్తుందన్న టాక్ వినపడుతుంది. ఆమె నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, అధికార టీఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ఓడించమని పిలుపునిచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News