Ys sharmila : వైవీ ఊరికే రాలేదు… వచ్చింది అందుకేనట
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా దానికి నామకరణం చేశారు. ఇక అంతటితో ఊరుకోలేదు. పాదయాత్రతో జనంలోకి వెళుతున్నారు. అంతా బాగానే [more]
;
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా దానికి నామకరణం చేశారు. ఇక అంతటితో ఊరుకోలేదు. పాదయాత్రతో జనంలోకి వెళుతున్నారు. అంతా బాగానే [more]
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా దానికి నామకరణం చేశారు. ఇక అంతటితో ఊరుకోలేదు. పాదయాత్రతో జనంలోకి వెళుతున్నారు. అంతా బాగానే ఉంది. వైఎస్ షర్మిల విజయం సాధిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఒకటి కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలుస్తారన్న వాదన ఒకటుంది. అదే సమయంలో జగన్ కు ఇష్టంలేకుండా తెలంగాణాలో పార్టీ పెట్టారన్న చర్చ కూడా జరుగుతుంది.
అన్నా చెల్లెళ్లకు….
ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిలకు, వైఎస్ జగన్ కు మధ్య మాటల్లేవ్. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో జరిగిన ప్రార్థనల్లోనూ వారు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమకు షర్మిల పార్టీతో సంబంధం లేదని చెప్పారు. అంతేకాదు తాము తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
వైవీ సడెన్ ఎంట్రీతో….
ఇక వైఎస్ విజయమ్మ తన కుమార్తె షర్మిల పార్టీకి మద్దతిస్తున్నారు. ఆమె ఏపీలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఇది కూడా విమర్శలకు తావిస్తుంది. అయితే జగన్ కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెట్టారని, జగన్ నుంచి షర్మిలకు ఎటువంటి సహకారం ఉండదని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా షర్మిల పాదయాత్రకు బాబాయి వైవీ సుబ్బారెడ్డి రావడం ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ చర్చనీయాంశమైంది.
దూరం తగ్గినట్లేనా?
జగన్ అనుమతి లేకుండా వైవీ సుబ్బారెడ్డి షర్మిల పాదయాత్రకు వచ్చే అవకాశాలు అయితే ఎంత మాత్రం లేదు. జగన్ అనుమతితోనే ఆయన వచ్చి షర్మిలను పలకరించి వెళ్లి ఉండాలి. కేవలం పలకరింపులు మాత్రమేనా? తమ మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి వెళ్లారా? అన్నది చర్చనీయాంశమైంది. జగన్ కు ఇష్టం లేకుండా పార్టీలో ఎవరూ ఏపనీ చేయరు. షర్మిలమ్మకు మద్దతు తెలపాలని ఉన్నా ఇన్నాళ్లు అనేక మంది నేతలు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి వచ్చి షర్మిలను కలసి వెళ్లడంతో కొంత అన్నా చెల్లెళ్ల మధ్య దూరం తగ్గినట్లేనని అంటున్నారు.